ఏపీ పీజీఈసెట్ ఫలితాలు విడుదల

Nara Lokesh Releases AP PGECET 2026 Results
  • 9,990 మంది పరీక్షలు రాయగా 9,320 ఉత్తీర్ణులైనట్లు లోకేశ్ వెల్లడి
  • ఉత్తీర్ణత శాతం 93.29 శాతంగా నమోదు
  • అధికారిక వెబ్ సైట్‌లో అందుబాటులో ర్యాంకు కార్డులు
  • వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు
ఉన్నత విద్యా ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పీజీఈసెట్-2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమ వేదికల ద్వారా వీటిని విడుదల చేశారు. 9,990 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 9,320 మంది ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. ఉత్తీర్ణత శాతం 93.29 శాతంగా ఉంది.

ర్యాంకు కార్డులు అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/PGECET/PGECET/PGECET_HomePage.aspx లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టిక్కెట్ నెంబర్‌లను ఎంటర్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. ఈ పోర్టల్ నుంచి ఫలితాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చని సూచించారు. ఏపీ పీజీఈసెట్-2026లో అర్హత సాధించిన విద్యార్థులకు మంత్రి లోకేశ్ అభినందనలు తెలియజేశారు.
Go Back to Shorts
Nara Lokesh
AP PGECET 2026
AP PGECET Results
Andhra Pradesh
Higher Education
Entrance Exam Results

More Telugu News