ఆఫ్ఘన్ క్రికెటర్ జాద్రాన్ ప్రాణాంతక వ్యాధితో పోరాటం... పరామర్శించిన సహచరులు

  • గ్రేటర్ నోయిడాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జాద్రాన్
  • పరామర్శించిన క్రికెటర్లు రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ
  • ఆసుపత్రిలోని చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న మహమ్మద్ నబీ
తీవ్ర అనారోగ్యంతో భారత్‌లో చికిత్స పొందుతున్న తమ దేశానికి చెందిన మాజీ క్రికెటర్ షాపూర్ జాద్రాన్‌ను ఆఫ్ఘనిస్థాన్ ప్రముఖ క్రికెటర్లు రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ నేడు పరామర్శించారు. హెమోఫాగోసైటిక్ లింఫోహిస్టియోసిస్ (హెచ్ఎల్‌హెచ్) అనే వ్యాధితో బాధపడుతున్న జాద్రాన్, గ్రేటర్ నోయిడాలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

జాద్రాన్‌ను పరామర్శించిన అనంతరం, రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ సామాజిక మాధ్యమాల్లో భావోద్వేగ పోస్టును పెట్టారు. ఆసుపత్రిలోని చిత్రాలను పంచుకున్నారు. గ్రేటర్ నోయిడాలో చికిత్స పొందుతున్న జాద్రాన్‌ను తాను, రషీద్ ఖాన్‌ కలిశామని మహమ్మద్ నబీ పోస్టులో పేర్కొన్నాడు.

నా ప్రియమైన సోదరుడు అరుదైన వ్యాధితో ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడ అని నబీ పేర్కొన్నాడు. మైదానంలో ఉంటే ఎలాంటి పోరాట పటిమను ప్రదర్శించేవాడో ఇప్పుడు జీవితంలో వ్యాధిపై అంతే ధైర్యంగా పోరాడుతున్నాడని తెలిపాడు. ఆసుపత్రి బెడ్ మీద అతనిని చూడటం బాధగా ఉందని భావోద్వేగానికి లోనయ్యాడు. అతడు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని పేర్కొన్నాడు.

జాద్రాన్ 44 వన్డేలు, 36 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ 38 ఏళ్ళ పేసర్ రెండు ఫార్మాట్‌లలో 80 వికెట్లు పడగొట్టాడు. 2020లో ఆఫ్ఘన్ తరఫున చివరి మ్యాచ్ ఆడాడు.

Shapoor Zadran
Afghanistan cricketer
Rashid Khan
Mohammad Nabi
Hemophagocytic Lymphohistiocytosis

More Telugu News