ఢిల్లీ కుర్రాడి బిజినెస్ ఐడియా.. కొండల్లో మ్యాగీ స్టాల్.. ఒక్క రోజులో ఎంత సంపాదించాడంటే!
- కొండల్లో మ్యాగీ అమ్మి ఓ యువకుడి వినూత్న ప్రయోగం
- ఒక్క రోజులోనే రూ.24,000 సంపాదించిన కంటెంట్ క్రియేటర్
- ప్లేటు మ్యాగీని రూ.100 నుంచి రూ.120కి విక్రయం
- సోషల్ మీడియాలో వీడియో వైరల్.. మిశ్రమ స్పందనలు
నగర జీవితానికి దూరంగా కొండ ప్రాంతాల్లో ఒకరోజు మ్యాగీ అమ్మితే ఎంత సంపాదించవచ్చో తెలుసుకోవాలనుకున్నాడు ఓ యువకుడు. అనుకున్నదే తడవుగా, కొండల్లో ఒక అందమైన ప్రదేశంలో తాత్కాలిక మ్యాగీ స్టాల్ పెట్టి వ్యాపార ప్రయోగం చేశాడు. ఆ ఒక్క రోజులో అతను ఏకంగా రూ.24,000 సంపాదించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఢిల్లీకి చెందిన కంటెంట్ క్రియేటర్ దేవాన్ష్ త్యాగి, తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఛాలెంజ్ వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. ఇటీవల అతను "కొండల్లో మ్యాగీ అమ్మి నేను ఎంత సంపాదించగలనో చూద్దాం" అంటూ ఒక వీడియో చేశాడు. ఇందుకోసం అతను ఒక సుందరమైన ప్రదేశాన్ని ఎంచుకుని, అక్కడ తన మ్యాగీ స్టాల్‌ను సిద్ధం చేశాడు. కస్టమర్ల కోసం టేబుళ్లు, ప్లాస్టిక్ కుర్చీలు ఏర్పాటు చేసి, పక్కనే వంట సామాగ్రితో తాత్కాలిక కిచెన్ సెటప్ చేసుకున్నాడు.
అనంతరం హైకింగ్ చేసేవారు, పర్యాటకులు అతని స్టాల్ వద్దకు రావడం మొదలుపెట్టారు. దేవాన్ష్ ప్రతి ఆర్డర్‌కు తాజాగా మ్యాగీ తయారు చేసి వారికి అందిస్తూ కనిపించాడు. సాధారణ మ్యాగీ ప్లేటును రూ.100కి, బటర్ మ్యాగీని రూ.120కి విక్రయించాడు. కొండల మధ్య వేడివేడి మ్యాగీని ఆస్వాదిస్తూ పలువురు కస్టమర్లు అతడిని అభినందించారు. రోజు ముగిసేసరికి తన వద్ద ఉన్న మ్యాగీ ప్యాకెట్లన్నీ అమ్ముడయ్యాయని, మొత్తం రూ.24,000 సంపాదించానని దేవాన్ష్ వీడియోలో వెల్లడించాడు.
ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. చాలా మంది నెటిజన్లు ఇదొక "కొత్త వ్యాపార ఆలోచన" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అయితే, వీడియోలో ఒక విషయంపై తీవ్ర చర్చ జరిగింది. మ్యాగీ వండటానికి దేవాన్ష్ సమీపంలోని వాగు నుంచి నీటిని సేకరించడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది పరిశుభ్రత, ఆరోగ్య భద్రత పరంగా సరైనది కాదని విమర్శించారు. మరికొందరు మాత్రం కొండ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు వేడివేడి మ్యాగీ తినడం ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని, ఈ ఆలోచన అద్భుతంగా ఉందని ప్రశంసించారు.