సిల్వర్ గౌనులో దేవకన్యలా ఊర్వశి రౌతేలా.. కేన్స్‌లో మరోసారి తన మార్క్ చూపిన బ్యూటీ!
- 79వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో ఊర్వశి రౌతేలా
- భారీ సిల్వర్ గౌనులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నటి
- పక్షి ఆకారంలో ఉన్న తల ఆభరణం ప్రధాన హైలైట్
- తనదైన మాక్సిమలిస్ట్ స్టైల్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించిన ఊర్వశి
- వియత్నాం లేబుల్ రూపొందించిన కస్టమ్ గౌనులో మెరుపులు
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 79వ ఎడిషన్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్ రివేరాలో మే 12 నుంచి 23 వరకు జరిగే ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ, ఫ్యాషన్ ప్రముఖులు హాజరయ్యారు. అలియా భట్, డెమీ మూర్ వంటి తారలు ప్రారంభోత్సవంలో తమ స్టైల్‌తో ఆకట్టుకోగా, బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా తనదైన ప్రత్యేకమైన డ్రెస్సింగ్ స్టైల్‌తో రెడ్ కార్పెట్‌పై ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
ప్రారంభోత్సవం కోసం ఊర్వశి వియత్నాంకు చెందిన ఫ్యాషన్ లేబుల్ 'జోలీపోలీ' డిజైన్ చేసిన కస్టమ్ కౌచర్ గౌనును ఎంచుకున్నారు. లావెండర్ రంగు బేస్‌పై భారీ సిల్వర్ అలంకరణతో ఉన్న ఈ గౌను చూడగానే కట్టిపడేసింది. క్రిస్టల్స్, సీక్విన్స్, పూసలు, రాళ్ల వర్క్‌తో గౌను మొత్తం కేన్స్ లైట్ల వెలుగులో తళతళా మెరిసింది. మత్స్యకన్య ఆకారాన్ని పోలి ఉన్న ఈ గౌను ఆమె అందాన్ని రెట్టింపు చేసింది.
ఈ డ్రెస్ ప్రత్యేకతల్లో కార్సెట్ తరహాలో ఉన్న బాడీస్ ఒకటి. గౌనుపై శిల్పం చెక్కినట్టుగా వెండి ఎంబ్రాయిడరీతో సున్నితమైన డిజైన్లు ఉన్నాయి. స్వీట్‌హార్ట్ నెక్లైన్‌తో పాటు భుజాల వద్ద ఉన్న అలంకరణలు డ్రెస్‌కు మరింత ఆకర్షణను తెచ్చిపెట్టాయి. పొడవైన కేప్ స్లీవ్స్, వాటికి వేలాడుతున్న క్రిస్టల్ టాసెల్స్... వెండి రెక్కలు తొడుక్కున్నట్టుగా ఆకర్షించాయి.
"ఐసీ సిల్వర్" థీమ్‌కు తగ్గట్టుగానే ఊర్వశి ఆభరణాలను ధరించారు. స్టేట్‌మెంట్ చోకర్ నెక్లెస్, దానికి సరిపోయే చెవిపోగులు, బ్రేస్‌లెట్‌తో పాటు జుట్టు ముడి మధ్యలో పక్షి ఆకారంలో ఉన్న మాంగ్ టిక్కా తరహా తల ఆభరణం అందరి దృష్టినీ ఆకర్షించింది. గౌను మొత్తం ఒకే రంగులో ఉన్నప్పటికీ, ఆమె చేతిలో పట్టుకున్న రంగురంగుల రాళ్లు, అద్దాలతో పొదిగిన బాక్స్ క్లచ్ ప్రత్యేకంగా నిలిచింది. ఇక పూర్తి గ్లామ్ మేకప్‌తో ఊర్వశి మరింత ప్రకాశవంతంగా కనిపించారు. సిల్వర్ షిమ్మర్ ఐస్, నిగనిగలాడే పెదవులు, ముఖానికి ఫ్రేమ్‌లా ఉన్న హెయిర్‌స్టైల్‌తో తన లుక్‌ను పూర్తి చేశారు. మొత్తంగా తనదైన బోల్డ్, మాక్సిమలిస్ట్ రెడ్ కార్పెట్ స్టైల్‌ను ఊర్వశి మరోసారి కేన్స్‌లో ప్రదర్శించారు.