విడాకుల వార్తల మధ్య మౌనీ రాయ్ ఎమోషనల్ పోస్ట్

Mouni Roy Emotional Post Amid Divorce Rumors
  • భర్త సూరజ్ నంబియార్‌తో మౌనీ రాయ్ విడాకులపై ప్రచారం
  • ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో మొదలైన ఊహాగానాలు
  • ఈ రూమర్ల మధ్య తన సోదరి కోసం మౌనీ రాయ్ భావోద్వేగ పోస్ట్
  • ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసిన సూరజ్ నంబియార్
ప్రముఖ నటి మౌనీ రాయ్ తన భర్త, వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌తో విడిపోతున్నారంటూ వస్తున్న వార్తల నడుమ.. ఆమె పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విడాకుల ప్రచారం మొదలయ్యాక ఆమె స్పందించడం ఇదే తొలిసారి కావడంతో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

బుధవారం ఉదయం మౌనీ రాయ్ తన సోదరిగా భావించే రూపాలీ కద్యన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని ఫోటోలను పంచుకున్నారు. "కష్టమొచ్చినా, సంతోషమొచ్చినా నువ్వే నా సోదరి" అంటూ భావోద్వేగ క్యాప్షన్‌ను జతచేశారు. అయితే, ఈ పోస్టులో ఎక్కడా ఆమె భర్త సూరజ్ కనిపించకపోవడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్నిచ్చింది.

మంగళవారం నుంచి వీరిద్దరి విడాకులపై వార్తలు మొదలయ్యాయి. మౌనీ, సూరజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడాన్ని అభిమానులు గమనించారు. ఇప్పటికే ఈ జంట విడివిడిగా ఉంటున్నారని సమాచారం. ఈ ప్రచారం జరుగుతుండగానే సూరజ్ నంబియార్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేయడం గమనార్హం. మౌనీ స్నేహితురాలు, నటి దిశా పటానీ కూడా సూరజ్‌ను అన్‌ఫాలో చేసినట్టు తెలుస్తోంది.

మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ 2022లో గోవాలో వివాహం చేసుకున్నారు. మలయాళీ, బెంగాలీ సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఇక సినిమాల విషయానికొస్తే మౌనీ రాయ్ ప్రస్తుతం మధుర్ భండార్కర్ "ది వైవ్స్", డేవిడ్ ధావన్ "హై జవానీ తో ఇష్క్ హోనా హై" చిత్రాలలో నటిస్తున్నారు.
Go Back to Shorts
Mouni Roy
Suraj Nambiar
Mouni Roy divorce
Indian actress
Bollywood actress
The wives movie
High Jawani Toh Ishq Hona Hai
Disha Patani
Gossip
Celebrity divorce

More Telugu News