‘పెద్ది’ చూస్తే మరో సినిమా గుర్తుకు రాదు: ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా

Peddi Movie Wont Remind You of Other Sports Films Says Art Director Avinash Kolla
  • 'పెద్ది' చూస్తే మరో స్పోర్ట్స్ డ్రామా గుర్తురాదు: ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా
  • సినిమా కోసం 24 పూర్తి సెట్లు, 70కి పైగా పాక్షిక సెట్లు నిర్మాణం
  • కథ విని 20 నిమిషాలు సాధారణ స్థితికి రాలేకపోయానన్న అవినాష్ కొల్లా
  • రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 'పెద్ది'
  • 1970-80ల నాటి విజయనగరం నేపథ్యంలో సినిమా కథ
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రాబోతున్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా తాజాగా చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. 'పెద్ది' చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు 'లగాన్' లేదా 'దంగల్' వంటి ఇతర స్పోర్ట్స్ సినిమాలు ఏమాత్రం గుర్తుకు రావని, ఆ దిశగా ఎంతో శ్రద్ధ తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.

ఈ సినిమా ఆర్ట్ వర్క్ కోసం ఏడాదికి పైగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరిపినట్లు అవినాష్ కొల్లా తెలిపారు. ఇందులో భాగంగా 24 పూర్తిస్థాయి సెట్లు, 60 నుంచి 70 వరకు పాక్షిక సెట్లు నిర్మించామని వివరించారు. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో టీమ్ చిత్ర ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలో తాజాగా పెద్ద ఆర్ట్ డైరెక్టర్ అవినాశ్ కొల్లా ఓ ఇంటర్వ్యూలో చిత్ర నిర్మాణ విశేషాలు పంచుకున్నారు.

హైదరాబాద్‌లో ఒక పూర్తి గ్రామాన్నే నిర్మించామని, అది ఏడాది పాటు వాతావరణ మార్పులను తట్టుకునేలా పటిష్టంగా ఉందని పేర్కొన్నారు. అలాగే, ఓ చెరుకు ఫ్యాక్టరీని కూడా పూర్తిగా కొత్తగా నిర్మించినట్లు తెలిపారు. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ కథ చెప్పినప్పుడు తాను తీవ్రంగా కదిలిపోయానని అవినాష్ కొల్లా పేర్కొన్నారు. "కథ విన్న తర్వాత ఒక 20 నిమిషాల పాటు నేను మనిషిని కాలేకపోయాను. అంతలా కదిలించింది" అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక సినిమా కోసం సెట్ వేశాక, అది సెట్ అని ప్రేక్షకుడికి తెలియకూడదని, 'పెద్ది'లో సెట్లు అంత సహజంగా ఉంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
 
రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా జాన్వీకపూర్ నటిస్తున్న ఈ సినిమాను రూ.300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మే 18న దీని ట్రైలర్ విడుదల కానుంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, దిష్యేందు, జగపతిబాబు, బోమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రుతిహాసన్ ప్రత్యేక పాటలో అలరించనున్నట్లు సమాచారం.
 
Go Back to Shorts
Peddi
Ram Charan
Buchi Babu Sana
Janhvi Kapoor
Avinash Kolla
Telugu movie
sports drama
Shivrajkumar
movie sets
Tollywood

More Telugu News