థియేటర్లు బంద్ చేయడం లేదు.. పర్పంటేజీ ఇచ్చేవాళ్ల సినిమాలే ప్రదర్శిస్తాం: తెలంగాణ ఎగ్జిబిటర్లు

Sridhar Telangana Film Chamber clarifies no theater shutdown only percentage films
  • పర్సంటేజీ విధానం అమలు చేసిన వారి సినిమాలను ప్రదర్శిస్తామని వెల్లడి
  • కొన్ని నిర్మాణ సంస్థలు ఇందుకు అంగీకరించాయని వెల్లడి
  • పర్సంటేజీ విధానంలో సినిమాలు ప్రదర్శిస్తేనే సింగిల్ స్క్రీన్లకు మనుగడ అని వెల్లడి
తాము థియేటర్లు బంద్ చేస్తున్నామని అసత్య ప్రచారం సాగుతోందని, కానీ అందులో నిజంలేదని, ఎవరైతే పర్సంటేజీ ఇస్తారో వాళ్ల సినిమాలను ప్రదర్శిస్తామని తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ శ్రీధర్ స్పష్టం చేశారు. గీత ఆర్ట్స్, శ్రీ వెంకటేశ్వర, సురేశ్ ప్రొడక్షన్స్, ఏషియన్ లాంటి సంస్థలు ఇప్పటికే ఈ విధానంలోకి వచ్చాయని తెలిపారు. మిగిలిన వారు కూడా త్వరలో వస్తారని ఆశిస్తున్నామని అన్నారు.

"అంతరించిపోతున్న సినిమా హాళ్లని కాపాడండి" అనే పేరుతో తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మీడియా సమావేశం నిర్వహించింది. చిత్ర బృందాలు జీవోలు తెచ్చుకున్నప్పటికీ తెచ్చుకున్నప్పటికీ ఇకపై సింగిల్ స్క్రీన్‌లలో టిక్కెట్ ధరలు పెంచబోమని స్పష్టం చేసింది. తాము ప్రేక్షకులు ఈ భరోసా ఇస్తున్నామని హామీ ఇచ్చింది. పర్సంటేజీ విధానంలో సినిమాలు ప్రదర్శిస్తేనే సింగిల్ స్క్రీన్లకు మనుగడ ఉంటుందని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న విషయాన్ని గుర్తు చేసింది.

ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శిరీష్ మాట్లాడుతూ, తాము నిర్మించిన చిత్రాలను పర్సంటేజీ షేరింగ్ విధానంలో ప్రదర్శించేందుకు అంగీకరిస్తామని వెల్లడించారు. మేం పర్సంటేజీ గురించి మాట్లాడుతున్నామని, ఎందుకంటే ఇది ఎగ్జిబిటర్ల బతుకు పోరాటామని అన్నారు. ఏ సినిమాను లేదా నిర్మాతను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం తమకు లేదని పేర్కొన్నారు. థియేటర్లను రక్షించాలని కోరారు. మిగిలిన రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు పర్సంటేజీ విధానం విధానం అమలు చేసి తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు రెంటల్ పద్ధతిని అమలు చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు.

నిర్మాత తండ్రి లాంటి వాడైతే ఎగ్జిబిటర్ బిడ్డలాంటివాడని చదలవాడ శ్రీనివాస్ పేర్కొన్నారు. అలాంటప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందని అన్నారు. గత ఇరవై ఏళ్లుగా ఎగ్జిబిటర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత ఏడాదిగా పరిస్థితి మరింత దిగజారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మాతగా నా మద్దతు ఎగ్జిబిటర్లకు ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు.

మల్టీప్లెక్సుల్లో కొత్త టెక్నాలజీ, ఆధునిక సౌకర్యాలు తీసుకువస్తున్నారని సునీల్ నారంగ్ అన్నారు. మల్టీప్లెక్స్‌లో కొత్త టెక్నాలజీ, ఆధునిక సౌకర్యాలు తీసుకువస్తున్నారని, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అలాంటి సౌకర్యాలు లేవని అన్నారు. డాల్బీ సౌండ్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉంటే ప్రేక్షకులు తప్పకుండా సింగిల్ స్క్రీన్‌లకు వస్తారని తెలిపారు. సింగిల్ స్క్రీన్లు మూతబడితే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకే నష్టమని పేర్కొన్నారు.
Go Back to Shorts
Sridhar Telangana Film Chamber
Telangana exhibitors
theater shutdown
percentage system
Geeta Arts

More Telugu News