నిదాఖాన్‌కు ఆశ్రయమిచ్చిన మజ్లిస్ కార్పొరేటర్ ఇల్లు కూల్చివేతకు నోటీసు

Nida Khan Shelter Notice to Demolish Majlis Corporators House
  • టీసీఎస్ కార్యాలయంలో బలవంతపు మతమార్పిళ్ళ కేసులో నిదాఖాన్ ప్రధాన నిందితురాలు
  • పరారీలో ఉన్న ఆమెకు ఆశ్రయమిచ్చిన కార్పొరేటర్ మతిన్ పటేల్
  • ఇంటిని, కార్యాలయాన్ని అక్రమంగా నిర్మించినట్లు గుర్తించిన మున్సిపల్ అధికారులు
  • నోటీసులు పంపించినట్లు తెలిపిన మేయర్ సమీర్
నాసిక్ టీసీఎస్ కార్యాలయంలో లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిళ్ళ కేసులో ప్రధాన నిందితురాలు నిదాఖాన్‌కు ఆశ్రయం ఇచ్చిన కార్పొరేటర్ ఇంటిని కూల్చివేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఇల్లు, కార్యాలయాన్ని అక్రమంగా నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో కూల్చివేయాలని నిర్ణయించారు.

బలవంతపు మతమార్పిళ్ళ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నిదాఖాన్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. కేసు నమోదైనప్పటి నుంచి 25 రోజుల పాటు పరారీలో ఉన్న ఆమెకు ఔరంగాబాద్‌లోని మజ్లిస్ కార్పొరేటర్ మతిన్ పటేల్ ఆశ్రయం ఇచ్చారు. ఈ మేరకు మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది.

అయితే, కార్పొరేటర్ తన ఇంటిని, కార్యాలయాన్ని అక్రమంగా నిర్మించినట్లు గుర్తించినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని ఆయనకు నోటీసులు పంపించినట్లు చెప్పారు. ఆయన నుంచి సంతృప్తికర సమాధానం రాకపోతే ఇల్లు, కార్యాలయాన్ని కూల్చివేస్తామని మేయర్ సమీర్ తెలిపారు. అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు రుజువైతే మతిన్ పటేల్ తన కార్పొరేటర్ పదవిని కూడా కోల్పోయే అవకాశం ఉంది.

నిదాఖాన్‌కు ఆశ్రయమివ్వాలని ఒత్తిడి

నిదాఖాన్‌కు ఆశ్రయమివ్వాలని మజ్లిస్ నేత ఇంతియాజ్ జలీల్ కార్పొరేటర్‌పై ఒత్తిడి తెచ్చినట్లు ఇటీవల మహారాష్ట్ర మంత్రి సంజయ్ ఆరోపించారు. ఆమెకు, ఆమె కుటుంబానికి ఆశ్రయం కల్పించిన వారిపై కూడా సిట్ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు లేఖ కూడా రాశారు. దీంతో నిదాఖాన్ ఆచూకీ పోలీసులకు లభ్యమైంది.
Go Back to Shorts
Nida Khan
Nida Khan case
Matim Patel
Aurangabad
Forced conversion case
Illegal construction

More Telugu News