బెంగాల్ సీఎస్‌గా ఎన్నికల అధికారి.. బీజేపీ ప్రభుత్వంపై టీఎంసీ ఫైర్
- బెంగాల్ సీఈవోగా పనిచేసిన మనోజ్ కుమార్ అగర్వాల్
- ఆయనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించిన సువేందు ప్రభుత్వం
- ఎన్నికల్లో బీజేపీకి మేలు చేసినందుకు మనోజ్‌కు దక్కిన బహుమతి అని టీఎంసీ ఆరోపణ
పశ్చిమ బెంగాల్‌లో నూతనంగా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా (సీఈవో) వ్యవహరించిన మనోజ్ కుమార్ అగర్వాల్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (చీఫ్ సెక్రటరీ) నియమించింది. సోమవారం ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ కీలక నియామకంపై ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిర్ణయంపై ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా వ్యవహరించినందుకే మనోజ్ అగర్వాల్‌కు ఈ 'బహుమతి' దక్కిందని ఆరోపించింది. టీఎంసీ ఎంపీ సాగరికా ఘోష్ స్పందిస్తూ "తటస్థంగా ఉండాల్సిన అధికారికి బహుమతి ఇచ్చారు. బెంగాల్ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగాయని ఇంకా ఎవరైనా నమ్ముతారా? ఇది సిగ్గుమాలిన చర్య" అని విమర్శించారు. మరో నేత సాకేత్ గోఖలే సైతం ఈ నియామకం బీజేపీ, ఎన్నికల సంఘం కుమ్మక్కయ్యాయనడానికి నిదర్శనమని ఆరోపించారు.
అయితే, ఈ ఆరోపణలను బీజేపీ ప్రభుత్వం తోసిపుచ్చింది. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అత్యంత సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించామని, చట్టాల గౌరవాన్ని పునరుద్ధరిస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని బీజేపీ బెంగాల్ యూనిట్ స్పష్టం చేసింది. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన మనోజ్ అగర్వాల్, ఎన్నికల అధికారిగా ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సుమారు 91 లక్షల ఓట్లను తొలగించి అప్పట్లో వార్తల్లో నిలిచారు. ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాల్లో గెలిచి తొలిసారి అధికారంలోకి రాగా, టీఎంసీ 80 స్థానాలకు పరిమితమైన సంగతి తెలిసిందే.