తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి నియామకం

  • ఆరుగురు సభ్యులను కూడా నియమించిన ప్రభుత్వం
  • సభ్యుల్లో కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత తదితరులు
  • ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి నియమితులయ్యారు. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్, ఆరుగులు సభ్యులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. సభ్యులుగా కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత, శశికళ యాదవ రెడ్డి, సదాలక్ష్మి, రాధాబాయి, ఉజ్మా షకీరాలను నియమించారు. వీరి పదవీకాలం ఐదేళ్ల పాటు ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ రాష్ట్రంలోని మహిళల హక్కులను పరిరక్షించడానికి, వారిపై జరుగుతున్న అన్యాయాలు, వేధింపులను అరికట్టడానికి ఏర్పాటు చేయబడిన చట్టబద్ధమైన సంస్థ. ఇది మహిళలకు న్యాయం చేకూర్చడం, సంక్షేమం మరియు సాధికారత కోసం పనిచేస్తుంది.

Gadwal Vijayalakshmi
Telangana Women's Commission
Telangana
Women Rights
Kasoja Shankaramma

More Telugu News