కేటీఆర్ పై నమోదైన కేసు గురించి రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..!
- ఫార్ములా-ఈ రేస్ నిధుల మళ్లింపు కేేసులో కేటీఆర్ పై నమోదైన కేసు
- దర్యాప్తులో తాము జోక్యం చేసుకోబోమన్న కేటీఆర్
- విచారణలో తేలిన నిజాల ఆధారంగా చర్యలు ఉంటాయని వ్యాఖ్య
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా-ఈ రేస్ నిధుల మళ్లింపు కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ కేసులో ప్రభుత్వం ఎవరిపై వ్యక్తిగత కక్షతో వ్యవహరించడం లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కేసుపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి... దర్యాప్తులో తాము జోక్యం చేసుకోబోమని వెల్లడించారు. ఎవరిని అరెస్ట్ చేయాలి లేదా ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది పూర్తిగా దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాల పరిధిలోని అంశమని ఆయన స్పష్టం చేశారు. విచారణలో తేలిన నిజాల ఆధారంగా, కేసు తీవ్రతను బట్టి మాత్రమే చర్యలు ఉంటాయని, అనవసరంగా ఎవరినీ ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన చెప్పారు. చట్టపరమైన నిబంధనల ప్రకారమే విచారణ కొనసాగుతుందని ఆయన వివరించారు.
మరోవైపు, ఈ చార్జిషీట్‌పై కేటీఆర్ స్పందిస్తూ... ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు అని కొట్టిపారేశారు. హైదరాబాద్ ప్రతిష్ఠను పెంచడం కోసమే తాము రేసును నిర్వహించామని, ఇందులో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని ఆయన వాదిస్తున్నారు.