విజయ్‌కి బిగ్ రిలీఫ్... మద్దతు లేఖను ఈమెయిల్ చేసిన వీసీకే పార్టీ

Vijay Gets Big Relief VCK Party Emails Support Letter
  • టీవీకేకు లేఖను ఈమెయిల్ చేసినట్లు 'ఎక్స్' ద్వారా వెల్లడి
  • అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలు గెలిచిన వీసీకే పార్టీ
  • వీసీకే మద్దతుతో 118కి చేరిన విజయ్ బలం
టీవీకే పార్టీకి, ఆ పార్టీ అధినేత విజయ్‌కి వీసీకే పార్టీ భారీ ఊరటను కలిగించింది. విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తాము మద్దతు పలుకుతున్నట్లు వీసీకే తన అధికారిక 'ఎక్స్' హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేసింది. మద్దతు లేఖను టీవీకే పార్టీకి మెయిల్ చేసినట్లు తెలిపింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వీసీకే రెండు స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో విజయ్‌కి మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యేల బలం 116గా ఉంది. తాజాగా వీసీకే మద్దతు లేఖ పంపించడంతో బలం 118కి చేరుకుంది.

వీసీకే పార్టీ నిన్నటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈరోజు మాత్రం విజయ్‌కి మద్దతివ్వాలని నిర్ణయించింది. అయితే వివిధ డిమాండ్లకు టీవీకే అంగీకరించకపోవడంతో వీసీకే మద్దతుపై వెనక్కి తగ్గినట్లు వార్తలు వచ్చాయి. ఏం జరిగిందో ఏమో కానీ, ఆ తర్వాత కాసేపటికే మద్దతు పలుకుతున్నట్లు లేఖను ఈమెయిల్ చేసినట్లు తెలిపింది. ఎక్స్ వేదికగా తమ పార్టీ అధినేత, టీవీకే చీఫ్‌తో చేయి కలుపుతున్నట్లుగా ఉన్న ఏఐ చిత్రాన్ని షేర్ చేసింది.
Go Back to Shorts
Vijay
TVK Party
VCK Party
Tamil Nadu Assembly Elections
Tamil Nadu Politics
Congress
Left Parties

More Telugu News