బాలయ్యతో జత కట్టనున్న బాలీవుడ్ బ్యూటీ
- బాలకృష్ణ, గోపీచందర్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం
- ఐటెం సాంగ్ కోసం నర్గీస్ ఫఖ్రీని రంగంలోకి దించినట్టు సమాచారం
- ఈ పాట కోసం హైదరాబాద్‌లోని ఒక స్టూడియోలో భారీ సెట్ నిర్మాణం
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ మలినేనిల కాంబినేషన్‌లో రాబోతున్న #NBK111 సినిమా గురించి వస్తున్న ఈ లేటెస్ట్ అప్‌డేట్ నందమూరి అభిమానుల్లో జోష్ నింపుతోంది. ఈ చిత్రంలో బాలయ్యతో బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫఖ్రీ జతకట్టనున్నట్టు సమాచారం. మరోవైపు, 'వీరసింహారెడ్డి' వంటి మాస్ హిట్టు తర్వాత బాలయ్య, గోపీచంద్ వీరిద్దరూ కలుస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
గతంలో గోపీచంద్ మలినేని సినిమాల్లోని ఐటెం సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనకు తెలిసిందే. ఈసారి ఆ జోరును మరింత పెంచేందుకు బాలీవుడ్ నటి నర్గీస్ ఫఖ్రీని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. 'రాక్ స్టార్' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నర్గీస్, బాలయ్య ఎనర్జీకి తోడైతే స్క్రీన్ పై గ్లామర్ అండ్ మాస్ విజువల్స్ అదిరిపోతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
హైదరాబాద్‌లోని ఒక స్టూడియోలో ఈ పాట కోసం చిత్ర బృందం ఒక భారీ సెట్‌ను నిర్మించింది. సమాచారం ప్రకారం, ఈ పాట షూటింగ్ ఈ రోజు (మే 8) నుంచే ప్రారంభం కానుంది. తమన్ అదిరిపోయే మాస్ ట్యూన్ ఇచ్చారని, బాలయ్య తనదైన సిగ్నేచర్ స్టెప్పులతో రచ్చ చేయబోతున్నారని టాక్. గోపీచంద్ మలినేని కూడా బాలయ్యను పక్కా మాస్ యాక్షన్ అవతారంలో చూపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.