కీలక పరిణామం.. విజయ్ కి మద్దతిచ్చే అంశాన్ని మిత్రపక్షాలకే వదిలేసిన స్టాలిన్

Stalin Leaves Vijay Support Decision to Allies Key Development
  • మ్యాజిక్ ఫిగర్ కు 5 స్థానాల దూరంలో నిలిచిన విజయ్
  • విజయ్ కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైన వీసీకే, కమ్యూనిస్టు పార్టీలు
  • స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చని మిత్ర పక్షాలకు చెప్పిన స్టాలిన్

తమిళనాడు రాజకీయాల్లో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభన ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకుంది. మ్యాజిక్ ఫిగర్ 118కి కేవలం 5 స్థానాల దూరంలో నిలిచిన విజయ్ టీవీకే పార్టీ, అధికారం కోసం చేస్తున్న ప్రయత్నాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి.


డీఎంకే నేతృత్వంలోని కూటమిలో ఉన్న వీసీకే, వామపక్ష పార్టీల నేతలు ఈరోజు స్టాలిన్‌ను కలిశారు. టీవీకే పార్టీ తమ మద్దతు కోరుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చించారు. ఈ సందర్భంగా స్టాలిన్ తన మిత్రపక్షాలకు 'ఫ్రీ హ్యాండ్' ఇచ్చారు. విజయ్‌కు మద్దతు ఇచ్చే విషయంలో స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చని ఆయన సూచించారు. ఇప్పటికే 5 సీట్లున్న కాంగ్రెస్ మద్దతు తెలపగా, ఇప్పుడు రెండేసి సీట్లున్న వీసీకే, సీపీఐ, సీపీఎం పార్టీలు కూడా సానుకూలంగా స్పందిస్తే విజయ్ పీఠం ఎక్కడం ఖాయం. వీసీకే, వామపక్షాలు కూడా మద్దతిస్తే... టీవీకే అధికార పీఠాన్ని అధిష్ఠించేందుకు ఆ పార్టీల సీట్లు సరిపోతాయి.


మరోవైపు, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ - విజయ్ మధ్య జరుగుతున్న చర్చలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఈరోజు ఉదయం జరిగిన భేటీలో గవర్నర్ పలు కీలక ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. మెజారిటీ లేకుండా ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారు? ఏ ఏ పార్టీలు మద్దతు ఇస్తాయో స్పష్టమైన ఆధారాలు ఏవి? అని ఆయన ప్రశ్నించారు. దీనికి విజయ్ బదులిస్తూ, తాను అసెంబ్లీలో 'ఫ్లోర్ టెస్ట్'కు సిద్ధమని, సభలోనే తన బలాన్ని నిరూపించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. అయితే, ప్రమాణ స్వీకారానికి ముందే మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ సూచించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.


గవర్నర్ వైఖరిని వీసీకే అధినేత తిరుమావళవన్ తీవ్రంగా తప్పుబట్టారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్‌ను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించకుండా అడ్డుకోవడం అంగీకారయోగ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీ వేదికగానే బలాబలాలు తేలాలని ఆయన డిమాండ్ చేశారు.

Go Back to Shorts
Vijay TVKE
Tamil Nadu Politics
Stalin
DMK Alliance
VCK
Left Parties Support
Governor Rajendra Vishwanath Arlekar
Floor Test
Thirumavalavan
Government Formation

More Telugu News