తమిళ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్! విజయ్‌కు పోటీగా డీఎంకే, అన్నాడీఎంకే కలుస్తాయా?
Add ap7am to your home Screen

తమిళ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్! విజయ్‌కు పోటీగా డీఎంకే, అన్నాడీఎంకే కలుస్తాయా?

Vijay political twist DMK AIADMK alliance rumors
  • డీఎంకే, అన్నాడీఎంకే మధ్య పొత్తు కోసం చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం
  • రెండు పార్టీలు కలిసినా, ప్రభుత్వ ఏర్పాటుకు చిన్న పార్టీల సహకారం తప్పనిసరి
  • అన్నాడీఎంకేతో కలవబోమన్న డీఎంకే నాయకుడు
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్! బద్ద రాజకీయ శత్రువులైన డీఎంకే, అన్నాడీఎంకే మధ్య పొత్తు కోసం చర్చలు జరుగుతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని డీఎంకే పార్టీ కొట్టి వేయడం గమనార్హం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ 108 స్థానాలు గెలిచి, మేజిక్ ఫిగర్‌కు 10 సీట్ల దూరంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ (5) మద్దతిచ్చినప్పటికీ విజయ్‌కి బలం సరిపోలేదు. దీంతో విజయ్ ప్రమాణ స్వీకారం వాయిదా పడినట్లు కూడా వార్తలు వచ్చాయి.

ఈ సమయంలో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. తమకు తగినంత సంఖ్యాబలం ఉందని డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు గవర్నర్‌కు సంకేతాలు కూడా పంపించినట్లు వార్తలు వస్తున్నాయి. చర్చలు జరిగాయని అన్నాడీఎంకే వర్గాలు ధృవీకరించాయని, కానీ ఫలితం ఏమిటనేది తెలియరాలేదని తెలుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 59, అన్నాడీఎంకే 47 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే ఈ రెండు పార్టీలు కలిసినా (106 స్థానాలు) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన సంఖ్యా బలం ఉండదు. ఈ కూటమికి వీసీకే వంటి చిన్న పార్టీల మద్దతు అవసరం. అయితే అన్నాడీఎంకేతో తమకు ఎలాంటి పొత్తు ఉండబోదని డీఎంకే అధికార ప్రతినిధి ఎ. శరవణన్ తెలిపారు.
Advertisement
Vijay
Tamil Nadu politics
DMK
AIADMK
Tamil Nadu Assembly Elections
TVK party
political alliance

More Telugu News