విజయ్‌ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. తీవ్రంగా స్పందించిన డీఎంకే

DMK Reacts Strongly to Congress Alliance with Vijays Party
  • కాంగ్రెస్ ప్రతి రాష్ట్రంలో ఇలాగే చేస్తోందన్న డీఎంకే అధికార ప్రతినిధి
  • అందుకే వరుసగా అన్ని రాష్ట్రాల్లో ఓడిపోతోందని ఇలంగోవన్ మండిపాటు
  • ఢిల్లీ, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయిందని ఆగ్రహం
  • పార్టీని మూసివేసుకునే పనులనే కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారని వ్యాఖ్య
తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంపై డీఎంకే పార్టీ తీవ్రంగా స్పందించింది. డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇలంగోవన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కొంతమంది ప్రజాప్రతినిధులు మొదటి నుంచి విజయ్‌కి మద్దతు ఇవ్వాలనే అభిప్రాయంతో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రతి రాష్ట్రంలో ఇలాగే చేస్తోందని విమర్శించారు. ఆ పార్టీ వ్యవహారశైలి కారణంగానే వరుసగా అన్ని రాష్ట్రాల్లో ఓడిపోతోందని అన్నారు.

గత సంవత్సరం ఢిల్లీ, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ఆయన మండిపడ్డారు. మహారాష్ట్రలో వారికి ఏమాత్రం అవకాశం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా మూసివేసే పనులనే వారు చేస్తున్నారని విమర్శించారు.

టీవీకే కార్యాలయానికి కాంగ్రెస్ నేతలు

అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే పార్టీతో కాంగ్రెస్ పొత్తు ఖరారు చేసుకుంది. చెన్నైలోని టీవీకే కార్యాలయానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించేందుకు కాంగ్రెస్ నాయకులు సుముఖత వ్యక్తం చేయగా, వారి నిర్ణయాన్ని విజయ్ స్వాగతించారు. 
Go Back to Shorts
Vijay
Tamil Nadu politics
TVK party
Congress alliance
DMK reaction
TKS Elangovan
Tamil Nadu elections

More Telugu News