మోదీ, అమిత్ షాల వ్యూహాలపై శశి థరూర్ ప్రశంసలు

  • కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలను చేసుకోవాలన్న శశి థరూర్
  • కేరళ మినహా ఇతర రాష్ట్రాల్లో పార్టీ పనితీరు నిరాశాజనకంగా ఉందని వ్యాఖ్య
  • బీజేపీ నేతల నిర్వహణా నైపుణ్యాల నుంచి ఎంతో నేర్చుకోవాల్సింది ఉందన్న థరూర్

కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ తనదైన శైలిలో మరోసారి ముక్కుసూటిగా స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాల ఎన్నికల వ్యూహాలను ప్రశంసించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తమ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కేరళలో యూడీఎఫ్ విజయం సాధించినప్పటికీ, మిగిలిన రాష్ట్రాల్లో పార్టీ పనితీరు నిరాశాజనకంగా ఉందని గుర్తు చేస్తూ, బీజేపీ నేతల నిర్వహణా నైపుణ్యాల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా బెంగాల్, అసోంలలో బీజేపీ అనుసరించిన బలమైన వ్యూహాలను ఆయన కొనియాడారు.


పశ్చిమ బెంగాల్‌లో తొలిసారిగా, అసోంలో వరుసగా మూడోసారి బీజేపీ అధికార పీఠాన్ని అధిరోహించడానికి సిద్ధమవుతోంది. మరోవైపు తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుండటం దక్షిణాది రాజకీయాల్లో పెను మార్పుగా కనిపిస్తోంది. పుదుచ్చేరిలో సైతం ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది.  


Shashi Tharoor
Narendra Modi
Amit Shah
Indian elections
BJP strategy
West Bengal elections
Assam elections
Tamil Nadu elections
political analysis

More Telugu News