అతుకులు లేని జాతీయ జెండాతో అద్భుతం... నేతన్నను అభినందించిన మంత్రి లోకేశ్
- అతుకులు లేని జాతీయ జెండాను రూపొందించిన నేతన్న
- పశ్చిమ గోదావరి జిల్లా కళాకారుడు సత్యనారాయణకు అంతర్జాతీయ రికార్డులు
- చేనేత కళాకారుడిని అభినందించిన మంత్రి నారా లోకేశ్
- ఆంధ్రకు గుర్తింపు తేవాలన్నదే తన లక్ష్యమన్న సత్యనారాయణ
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు రుద్రాక్షల రామలింగ సత్యనారాయణను మంత్రి నారా లోకేశ్ అభినందించారు. అశోక చక్రంతో సహా ఎలాంటి అతుకులు లేకుండా ఏక వస్త్రంతో జాతీయ జెండాను రూపొందించి, పలు అంతర్జాతీయ రికార్డులు సాధించినందుకు గాను ఆయనకు ఈ ప్రశంసలు దక్కాయి.
బుధవారం సాయంత్రం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సత్యనారాయణ మంత్రి లోకేశ్‌తో భేటీ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వేమవరం గ్రామానికి చెందిన సత్యనారాయణ, తన అరుదైన నైపుణ్యంతో ఈ ఘనత సాధించారు.
ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ, "తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఎగురవేసే 6x12 సైజు జెండాను, తర్వాత ఎర్రకోటపై ఎగురవేసే 8x12 జాతీయ జెండాను తయారు చేశా. ఆంధ్రకు గుర్తింపు రావాలన్న ఆకాంక్షతోనే దేశంలోనే అత్యంత అరుదైన ఏకవస్త్ర చేనేత జాతీయ జెండాను రూపొందించా" అని వివరించారు.
చేనేత కళపై తనకున్న మక్కువతో అద్భుతమైన జెండాను రూపొందించిన సత్యనారాయణ కృషిని మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా కొనియాడారు. ఆయన నైపుణ్యం రాష్ట్రానికి గర్వకారణమని ప్రశంసించారు.