ప్రభుత్వం ఏర్పాటు కోసం ఆ నిర్ణయాన్ని విజయ్‌కే అప్పగించాం: టీవీకే ఎమ్మెల్యే

Vijay to Decide on Government Formation Says TVK MLA
  • ఏ పార్టీల మద్దతు తీసుకోవాలో నిర్ణయాన్ని విజయ్‌కి అప్పగించామన్న ఎమ్మెల్యే
  • రిసార్టు రాజకీయాలు చేయవద్దని విజయ్ ఆదేశించారన్న ఎమ్మెల్యే
  • గవర్నర్ రాగానే శాసనసభా పక్ష నేత వెళ్లి గవర్నర్‌ను కలుస్తారన్న ఎమ్మెల్యే
ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీల మద్దతు తీసుకోవాలనే నిర్ణయాన్ని తమ పార్టీ అధినేత విజయ్‌కే అప్పగించినట్లు టీవీకే పార్టీ ఎమ్మెల్యే జగన్నాథ్ మిశ్రా తెలిపారు. పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో విజయ్‌ని నాయకుడిగా ఎన్నుకున్నామని అన్నారు. గవర్నర్ చెన్నై రాగానే తమ పార్టీ శాసనసభాపక్ష నేత హోదాలో విజయ్ వెళ్ళి ఆయనను కలుస్తారని చెప్పారు. తమ పార్టీకి పూర్తి బలం లేని నేపథ్యంలో రిసార్టు రాజకీయాలు మాత్రం చేయవద్దని విజయ్ ఆదేశించారని వెల్లడించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలకు గాను టీవీకే 108 సీట్లలో గెలిచింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మరో 10 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఈ నేపథ్యంలో రిసార్టు రాజకీయాలు వద్దని విజయ్ పార్టీ కేడర్‌కు సూచనలు చేయడం గమనార్హం.

మంగళవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో టీవీకే శాసనసభాపక్షం ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పది సీట్లు తక్కువగా ఉన్న విషయం ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకే పార్టీ కాంగ్రెస్, అన్నాడీఎంకే పార్టీలతో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మెజారిటీని నిరూపించుకోవడానికి టీవీకే నేతలు గవర్నర్‌ను కలిసి పదిహేను రోజుల సమయం కోరనున్నారని తెలుస్తోంది.
Go Back to Shorts
Vijay
TVK Party
Tamil Nadu Politics
Government Formation
Assembly Elections 2024
Jaganath Mishra

More Telugu News