పెరంబూరు, తిరుచ్చి సీట్లలో విజయ్ ఎక్కడి నుంచి రాజీనామా చేస్తారు?
- తమిళనాడులో 108 సీట్లు గెలుచుకున్న టీవీకే పార్టీ
- రెండు నియోజకవర్గాల్లో విజయ్ ఘన విజయం
- పెరంబూరును విజయ్ అట్టిపెట్టుకునే అవకాశం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ అధినేత, సినీ నటుడు విజయ్ తిరుచ్చి (తూర్పు), పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీచేసి రెండుచోట్ల ఘన విజయం సాధించారు. 234 సీట్లకు గాను టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించింది. మేజక్ ఫిగర్‌కు పది సీట్ల దూరంలో ఉంది. రెండు చోట్ల నుంచి గెలిచిన విజయ్ తిరుచ్చి (తూర్పు) ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, పెరంబూర్ నుంచి కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తిరుచ్చి (తూర్పు)లో డీఎంకే అభ్యర్థి ఇరుదయరాజ్‌ను 27,416 ఓట్ల తేడాతో, పెరంబూరులో ఆర్డీ శేఖర్ (డీఎంకే)ను 53,715 ఓట్ల తేడాతో విజయ్ ఓడించారు. విజయ్ వ్యూహాత్మకంగా ఈ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశారు.
పెరంబూరు నియోజకవర్గం చెన్నై ఉత్తర భాగంలో ఉంటుంది. ఇక్కడి నుంచి దాదాపు ఆరు దశాబ్దాలుగా డీఎంకే లేదా అన్నాడీఎంకే గెలుస్తూ వస్తోంది. డీఎంకేకు మంచి పట్టు ఉంది. ఇలాంటి చోట విజయ్ పోటీ చేసి గెలుపొందారు.
మరోవైపు, తిరుచ్చి (తూర్పు)లో పోటీ చేయడం ద్వారా, నగరం వెలుపల కూడా తన సత్తాను చాటాలని విజయ్ భావించారు. ఇక్కడి ఇరుకు వీధుల్లో కూడా జోరుగా ప్రచారం చేశారు.
ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ద్రవిడ పార్టీ దిగ్గజాలుగా పేరుగాంచిన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు ఆరు దశాబ్దాలుగా ఇక్కడ సత్తా చాటుతున్నాయి. ఈ ద్రవిడ పార్టీలను విజయ్ మట్టికరిపించారు. డీఎంకే 59, అన్నాడీఎంకే 47 స్థానాలతో సరిపెట్టుకున్నాయి.
సినిమా రంగం నుంచి వచ్చిన ఎంజీఆర్ 1977లో, జయలలిత 1991లో ముఖ్యమంత్రి అయ్యారు. మూడున్నర దశాబ్దాల తర్వాత అదే రంగం నుంచి వచ్చిన విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయమైంది. మేజిక్ ఫిగర్‌కు మరో పది స్థానాలు తక్కువ ఉండటంతో ఎవరితో వెళ్లాలనే అంశంపై టీవీకే పార్టీలో చర్చ సాగుతోంది. కాంగ్రెస్, వామపక్షాలు, అన్నాడీఎంకే వంటి పార్టీలతో చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది.