మెట్ గాలాలో హైదరాబాదీ మెరుపు... రూ. 142 కోట్ల నెక్లెస్‌తో సుధా రెడ్డి
- ప్రపంచ ఫ్యాషన్ వేదిక మెట్ గాలాలో మెరిసిన సుధా రెడ్డి
- 142 కోట్ల రూపాయల విలువైన నెక్లెస్‌తో ప్రత్యేక ఆకర్షణ
- మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన 'ట్రీ ఆఫ్ లైఫ్' దుస్తుల్లో అబ్బురపరిచిన తెలుగు మహిళ
- కలంకారీ, పాలపిట్ట, జమ్మిచెట్టు వంటి మోటిఫ్‌లతో తెలుగు సంస్కృతికి పెద్దపీట
- హైదరాబాద్ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పడమే తన లక్ష్యమన్న సుధా రెడ్డి
ప్రపంచ ఫ్యాషన్ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే మెట్ గాలా ఈవెంట్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ తారలు, సెలబ్రిటీలు తమదైన ఫ్యాషన్‌తో సందడి చేశారు. అయితే, న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త సుధా రెడ్డి మాత్రం తన ప్రత్యేకమైన డ్రెస్సింగ్‌తో, కోట్ల రూపాయల ఆభరణాలతో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నారు. ఆమె ధరించిన దుస్తులతో పాటు మెడలోని నెక్లెస్ ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది.
ఈ కార్యక్రమంలో సుధా రెడ్డి ధరించిన నెక్లెస్ విలువ దాదాపు 15 మిలియన్ డాలర్లు, అంటే మన కరెన్సీలో సుమారు రూ. 142.8 కోట్లు. ఇది ఆమె వ్యక్తిగత కలెక్షన్‌కు చెందినదని తెలిసింది. విక్టోరియన్ ఫినిషింగ్‌తో పెద్ద పరిమాణంలో ఉన్న రోజ్-కట్ డైమండ్స్‌తో ఈ నెక్లెస్‌ను రూపొందించారు. దీని మధ్యలో ఉన్న 550 క్యారెట్ల లోతైన నీలిరంగు టాంజనైట్ లాకెట్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. టాంజానియాలోని మెరలానీ హిల్స్‌లో లభించే ఈ తరహా రత్నాన్ని 'క్వీన్ ఆఫ్ మెరలానీ' అని కూడా పిలుస్తారు. ఈ నెక్లెస్‌తో పాటు 30 క్యారెట్ల పోల్కీ డైమండ్ రింగ్, 40 క్యారెట్ల కొలంబియన్ ఎమరాల్డ్ రింగ్‌ను కూడా ఆమె ధరించారు.
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా రూపొందించిన ఈ డ్రెస్ 'ట్రీ ఆఫ్ లైఫ్' (జీవన వృక్షం) థీమ్‌తో రూపుదిద్దుకుంది. దీని రూపకల్పనలో పురాతన కలంకారీ కథన సంప్రదాయాల నుంచి స్ఫూర్తి పొందారు. పాలపిట్ట, జమ్మిచెట్టు, కల్పవృక్షం, తంగేడు వంటి మనకు తెలిసిన మోటిఫ్‌లను ఈ డ్రెస్‌పై ఎంతో అందంగా పొందుపరిచారు.
ఈ డ్రెస్ ద్వారా తాను హైదరాబాద్ సంస్కృతిని, తెలుగు ప్రజల జీవన విధానాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించాలనుకున్నానని సుధా రెడ్డి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వివరించారు. "హైదరాబాద్ నా మూలం మాత్రమే కాదు.. అదొక భాష, ఒక జీవన లయ. ఈ డ్రెస్ కేవలం అలంకరణ కాదు, ఇది తరతరాల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక జీవన సంగ్రహం" అని ఆమె పేర్కొన్నారు. కొన్ని గంటలపాటు ఎందరో కళాకారులు ఈ డ్రెస్‌ను రూపొందించారని తెలిపారు. కాగా, సుధా రెడ్డి 2021లో తొలిసారి మెట్ గాలాలో అడుగుపెట్టారు.