నిజాయతీకి నిలువుటద్దం.. పొరపాటున వచ్చిన రూ.10 వేలు తిరిగిచ్చిన ఉబెర్ డ్రైవర్!
- పొరపాటున తన ఖాతాలో పడిన రూ.10 వేలను టెక్కీకి తిరిగిచ్చిన ఉబెర్ డ్రైవర్
- ఒడిశాలోని భువనేశ్వర్‌లో వెలుగు చూసిన స్ఫూర్తిదాయక ఘటన
- డ్రైవర్ నిజాయతీని వివరిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్
- సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్.. డ్రైవర్‌పై నెటిజన్ల ప్రశంసలు
ఆన్లైన్ మోసాలు, డిజిటల్ స్కామ్‌లు సర్వసాధారణమైపోయిన ఈ రోజుల్లో నిజాయతీకి మారుపేరుగా నిలిచాడో ఉబెర్ డ్రైవర్. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొరపాటున తన ఖాతాకు పంపిన రూ.10,000 మొత్తాన్ని వెతికి మరీ తిరిగి అప్పగించి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన ఈ ఘటన తాలూకు వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే..!
భువనేశ్వర్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేబశిష్ త్రిపాఠి, ఇటీవల తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఈ ఘటన గురించి పంచుకున్నారు. ఆయన కథనం ప్రకారం.. "నేను పని మీద ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాను. నా వ్యాపార భాగస్వామికి రూ.10,000 పంపాల్సి ఉండగా, పొరపాటున ఉబెర్ డ్రైవర్‌కు పంపించాను. ఇద్దరి పేర్లూ ఒకటే కావడంతో ఈ పొరపాటు జరిగింది. యాప్ ద్వారా అతడిని సంప్రదించడానికి ప్రయత్నించినా వీలు కాలేదు. దీంతో ఇక, ఆ డబ్బులు తిరిగిరావని నేను భావించాను" అని దేబశిష్ తన పోస్టులో పేర్కొన్నారు.
అయితే, అందరినీ ఆశ్చర్యపరుస్తూ అదే రోజు రాత్రి 9:30 గంటలకు దేబశిష్కు తన అపార్ట్మెంట్ సెక్యూరిటీ నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఉబెర్ డ్రైవర్ శ్రీకాంత, దేబశిష్ అడ్రస్ తెలుసుకుని, డబ్బు తిరిగి ఇచ్చేందుకు స్వయంగా అక్కడికి వచ్చాడు. ఈ విషయాన్ని వివరిస్తూ దేబశిష్.. "ఆ ఉబెర్ డ్రైవర్ నా కోసం వెనక్కి వచ్చి ప్రతి పైసా తిరిగి ఇచ్చేశారు. ఆయన నిజాయతీకి చిన్న బహుమతి ఇస్తానన్నా సున్నితంగా తిరస్కరించారు. ఈ రోజుల్లో ఇంతటి నిజాయతీ, చిత్తశుద్ధి చూడటం చాలా అరుదు. నా కోసం ఇంత శ్రమ తీసుకున్న శ్రీకాంతకు నేను ఎంతో రుణపడి ఉంటాను" అని రాసుకొచ్చారు.
ఈ పోస్ట్ కొద్ది గంటల్లోనే 1.6 లక్షలకు పైగా వ్యూస్‌తో వైరల్‌గా మారింది. శ్రీకాంత నిజాయతీని మెచ్చుకుంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. "మంచి వాళ్లకు మంచే జరుగుతుంది", "ఆ నిజాయతీపరుడిని దేవుడు చల్లగా చూడాలి" అంటూ ప్రశంసించారు. ఇదే సమయంలో మరో యూజర్ తన చేదు అనుభవాన్ని పంచుకుంటూ, "నేను పొరపాటున పంపిన రూ.2000 ఓ ఆటో డ్రైవర్ కాజేశాడు. ఉబెర్ కస్టమర్ సపోర్ట్ కూడా స్పందించలేదు" అని వాపోయాడు.