ఆకివీడు రామాలయంపై హైకోర్టులో మరో పిల్ .. నేడు విచారణ
- ఆకివీడు రామాలయ నిర్మాణ అనుమతులపై హైకోర్టులో పిటిషన్
- ప్రభుత్వ భూమిలో మతపరమైన నిర్మాణం చట్టవిరుద్ధమని వాదన
- నిర్మాణంపై స్టే విధించాలని కోరిన పిటిషనర్లు
- పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుపుతామని స్పష్టం చేసిన న్యాయస్థానం
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న రామాలయంపై మరో పిల్ దాఖలైంది. ఆలయ నిర్మాణానికి అధికారులు ఇచ్చిన అనుమతులను సవాల్ చేస్తూ స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం విచారణ జరిపేందుకు న్యాయస్థానం అంగీకరించింది.
ఆకివీడులోని పెదపేటకు చెందిన వంగా జ్యోత్స్న, మరికొందరు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రభుత్వ భూమిలో మతపరమైన నిర్మాణాలు చేపట్టడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని వారు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేశారని, హడావుడిగా నిర్మాణం జరుపుతున్నారని ఆరోపించారు. ఆలయ నిర్మాణంపై తక్షణమే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి, పనులు నిలిపివేయాలని కోరారు.
సోమవారం పిటిషనర్ల తరఫు న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ ఈ వ్యాజ్యాన్ని లంచ్ మోషన్‌గా స్వీకరించి, అత్యవసర విచారణ జరపాలని జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ను కోరారు. అయితే, లంచ్ మోషన్‌కు నిరాకరించిన న్యాయమూర్తి, ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపడతామని స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యవహారంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.