విజయ్ గెలుపు ఈజీగా వచ్చింది కాదు.. ఆరు దశల పక్కా ప్రణాళిక.. తెరవెనుక వ్యూహం ఇదే!
- అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలతో క్షేత్రస్థాయి నెట్‌వర్క్‌గా మార్పు
- 2021 స్థానిక ఎన్నికల్లో స్వతంత్రులుగా పోటీ చేయించి వ్యవస్థను పరీక్షించడం
- కార్పొరేట్ తరహా స్క్రీనింగ్‌తో అభిమానులను క్రమశిక్షణ గల క్యాడర్‌గా నిర్మాణం
- 'అనిల్' అనే గుర్తింపుతో ఉడుత సాయం నుంచి అధికారం వైపు ప్రయాణం
తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభంజనం సృష్టించింది. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన టీవీకే, ఎవరూ ఊహించని విధంగా 108 స్థానాల్లో గెలుపొందింది. 234 స్థానాలున్న తమిళ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 సీట్ల మేజిక్ ఫిగర్‌కు కేవలం 10 స్థానాల దూరంలో నిలిచింది. అయితే, ఈ విజయం ఈ ఎన్నికల సమయంలో పుట్టింది కాదు. ఇది ఏళ్ల తరబడి దశలవారీగా నిర్మించిన ఒక పటిష్ఠమైన వ్యూహం తాలూకు ఫలితం. అభిమాన సంఘాల నుంచి క్రమశిక్షణ గల రాజకీయ శక్తిగా మారిన ఈ ప్రస్థానం ఆరు కీలక దశల్లో సాగింది.
దశ 1: అభిమాన సంఘాలే పునాది
విజయ్‌కు తమిళనాడు అంతటా లక్షలాది మందితో కూడిన 'రసిగర్ మండ్రాలు' (అభిమాన సంఘాలు) ఉన్నాయి. ఆయన వాటిని కేవలం సినిమా ప్రచారాలకే పరిమితం చేయలేదు. వాటిని వ్యవస్థీకృత సేవా కార్యక్రమాల్లోకి మళ్లించారు. రక్తదాన శిబిరాలు, విపత్తు సహాయక చర్యలు, విద్యార్థులకు సన్మానాలు, ఇతర సామాజిక కార్యక్రమాలతో ప్రజలకు నిరంతరం చేరువయ్యారు. కోయంబత్తూరు వంటి నగరాల్లో వేలాది మంది అభిమానులు సంఘటితమై సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీనివల్ల ఎన్నికల సమయంలో కాకుండా ఏళ్ల తరబడి ప్రజలతో ఒక ప్రత్యక్ష, రాజకీయాలకు అతీతమైన సంబంధం ఏర్పడింది.
దశ 2: అసలు ఎన్నికకు ముందు ప్రయోగం
2021లో విజయ్ తన వ్యవస్థను పరీక్షించడానికి ఒక ప్రయోగం చేశారు. పార్టీని అధికారికంగా ప్రకటించకుండా, తన అభిమాన సంఘాల సభ్యులను స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్రులుగా పోటీ చేయించారు. కేవలం నెట్‌వర్క్‌ను మాత్రమే క్రియాశీలం చేశారు. అప్పుడు మొత్తం 169 మంది పోటీ చేయగా, 115 మంది విజయం సాధించారు. అభ్యర్థుల ఎంపిక, బూత్ నిర్వహణ, ఓట్లను సమీకరించడంలో తమ నెట్‌వర్క్ ఎంత పటిష్ఠంగా ఉందో ఈ ప్రయోగం నిరూపించింది.
దశ 3: అభిమానుల నుంచి క్రమశిక్షణ గల క్యాడర్‌గా
2026 ఎన్నికలకు ముందు, కేవలం అభిమానులను చేర్చుకోవడంపై కాకుండా, సరైన వారిని ఎంచుకోవడంపై విజయ్ దృష్టి పెట్టారు. కార్పొరేట్ తరహాలో ఇంటర్వ్యూలు, నేపథ్య పరిశీలనలు జరిపి బాధ్యతలు అప్పగించారు. కేవలం అభిమానం ఉంటే సరిపోదు, క్రమశిక్షణ, పనితీరు ఆధారంగా వార్డ్ ఇన్‌చార్జ్‌లు, బూత్ ఏజెంట్లు, నియోజకవర్గ సమన్వయకర్తలను నియమించారు. దీంతో అభిమానుల భావోద్వేగ బలానికి, సంస్థాగత క్రమశిక్షణ తోడైంది.
దశ 4: సంకేతంగా మారిన 'విజిల్' గుర్తు
విజిల్ గుర్తును వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా, సులభంగా గుర్తుపట్టేలా రూపొందించారు. ఈ గుర్తు కేవలం బ్యానర్లకే పరిమితం కాలేదు. మహిళలు తమ ఇళ్ల ముందు విజిల్ ఆకారంలో ముగ్గులు (కొళం) వేయడం ప్రారంభించారు. దీంతో వీధులన్నీ విజయ్ మద్దతుకు నిలువుటద్దంగా మారాయి. ఇది చూడటానికి సహజంగా అనిపించినా, దీని వెనుక పక్కా ప్రణాళికతో కూడిన వ్యవస్థ పనిచేసింది.
దశ 5: ప్రచారం వెనుక పటిష్ఠ నెట్‌వర్క్
ప్రచారానికి అవసరమైన యంత్రాంగాన్ని కొత్తగా నిర్మించలేదు. ఏళ్లుగా ఉన్న వాట్సాప్ గ్రూపులనే ప్రచారానికి ఉపయోగించారు. జెండాలు, రవాణా, ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించడం వంటి పనులను వాలంటీర్లే చూసుకున్నారు. విజయ్ ఒకవైపు స్థానిక నాయకులతో సమావేశమై క్షేత్రస్థాయి సమాచారాన్ని తీసుకుంటూ, మరోవైపు అవినీతి, సంక్షేమం, యువత వంటి అంశాలపై సందేశాలను కింది స్థాయికి పంపిస్తూ వ్యూహాత్మక నియంత్రణను తన చేతుల్లో ఉంచుకున్నారు.
దశ 6: 'అనిల్'.. ఒక ప్రత్యేక గుర్తింపు
ఈ ప్రస్థానంలో విజయ్ మద్దతుదారులకు "అనిల్" (ఉడుత) అనే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. 2011లో విజయ్ ఏఐఏడీఎంకేకు మద్దతిచ్చినప్పుడు, శ్రీరాముడు లంకకు వారధి నిర్మించే సమయంలో ఉడుత తన వంతు సహాయం చేసినట్టు తాము కూడా చిన్న సాయం చేస్తున్నామని ఆయన తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. దీన్ని ప్రత్యర్థులు ఎగతాళిగా 'అనిల్' అని పిలవడం మొదలుపెట్టారు. కానీ కాలక్రమేణా, విజయ్ మద్దతుదారులు దాన్నే గర్వంగా స్వీకరించి, తమ గుర్తింపుగా మార్చుకున్నారు. చిన్న చిన్న శక్తులు ఏకమైతే పెద్ద విజయం సాధించవచ్చనడానికి ఈ ప్రయాణం ఒక ఉదాహరణగా నిలిచింది.