విజయ్ చరిత్ర సృష్టించాడన్న విక్రమ్, 'విజిల్' వేసిన నటుడు జీవా

  • టీవీకే పార్టీ అధినేతకు అభినందనల వెల్లువ
  • "అభినందనలు మిత్రమా, నువ్వు చరిత్ర సృష్టించావ్" అంటూ విక్రమ్ పోస్టు
  • "బ్లాస్టు బ్లాస్టు" అంటూ విజిల్ వేసిన వీడియోను పంచుకున్న జీవా
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ విజయం దిశగా దూసుకుపోతుండటంతో రాజకీయ, సినీ ప్రముఖులు ఆ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్‌కు అభినందనలు చెబుతున్నారు. నటుడు విక్రమ్ ఇన్‌స్టా వేదికగా విజయ్‌కి శుభాకాంక్షలు చెప్పారు. "అభినందనలు మిత్రమా, నువ్వు చరిత్ర సృష్టించావ్" అని పేర్కొన్నారు. నటుడు జీవా "విజిల్" వేసి ఓటు వేసిన వారికి థ్యాంక్స్ చెప్పారు. "బ్లాస్టు బ్లాస్టు" అంటూ విజిల్ వేసిన వీడియోను పోస్టు చేశారు.

మొదటి ఎన్నికల్లోనే అద్భుతమైన ప్రభావం చూపిన విజయ్ సర్‌కు అభినందనలు అని నటుడు శివకార్తికేయన్ పేర్కొన్నారు. విజయ్ చిత్ర పరిశ్రమకు చెందినవారు కావడం మరింత ఆనందంగా ఉందని అన్నారు. చిత్ర పరిశ్రమలో ఎత్తైన శిఖరాలకు చేరిన విజయ్, ప్రజాసేవలోనూ రాణించాలని కోరుకుంటున్నానని అన్నారు. 

Vijay
Tamil Nadu Assembly Elections
TVK Party
Vikram
Actor Jeeva
Sivakarthikeyan
Tamil Cinema

More Telugu News