అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: ఆ పార్టీ పనైపోయిందన్న బండి సంజయ్
- కాంగ్రెస్ ఇక ఎప్పటికీ అధికారంలోకి రాదన్న బండి సంజయ్
- దేశ రాజకీయ ముఖచిత్రం నుంచి ఆ పార్టీ కనుమరుగవుతోందన్న బండి సంజయ్
- కీలక బిల్లులను వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని వ్యాఖ్య
కాంగ్రెస్ పార్టీ ఇక ఎప్పటికీ అధికారంలోకి రాదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా కొనసాగుతోంది. ట్రెండ్స్ చూస్తుంటే అసోంను కమలం పార్టీ తిరిగి నిలబెట్టుకునేలా ఉంది. తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమిని విజయ్ పార్టీ చిత్తు చేసిందనే చెప్పవచ్చు. కేరళలో మాత్రమే కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ విజయం దిశగా దూసుకుపోతోంది.
ఈ ఫలితాలపై సంజయ్ స్పందిస్తూ, ఐదు రాష్ట్రాల్లో వెలువడుతున్న ఫలితాలు దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయని అభిప్రాయపడ్డారు. ఆ పార్టీ ఇక ఎప్పటికీ అధికారంలోకి రాదని వ్యాఖ్యానించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తిరస్కరించినట్లు చెప్పారు. దేశ రాజకీయ ముఖ చిత్రం నుంచి ఆ పార్టీ కనుమరుగవుతోందని ఎద్దేవా చేశారు.
మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన వంటి చారిత్రాత్మక బిల్లులను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని, అందుకే కాంగ్రెస్ కూటమి పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. అభివృద్ధికి అడ్డుపడితే ప్రజలు క్షమించరని ఆయన అన్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీని పరిపూర్ణ నాయకుడిగా వారి పార్టీ వారే గుర్తించడం లేదని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ కారణంగా కాంగ్రెస్ పాతాళానికి పడిపోవడం ఖాయమని అన్నారు.