విజయ్ నివాసానికి వెళ్లిన త్రిష!

Trisha Visits Vijays Residence
  • ఘన విజయం దిశగా దూసుకెళుతున్న విజయ్ పార్టీ టీవీకే
  • విజయ్ నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపిన త్రిష
  • విజయ్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే అవకాశం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నటుడు విజయ్ పార్టీ టీవీకే దూసుకుపోతోంది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను టీవీకే 108 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికార పీఠాన్ని చేజిక్కించుకునేందుకు టీవీకేకు మరో 10 సీట్లు మాత్రమే అవసరం. పూర్తి మెజారిటీ రాకపోతే ఇతర పార్టీల మద్దతుతో విజయ్ సీఎం పీఠాన్ని అధిష్ఠించే అవకాశం ఉంది. పార్టీ పెట్టిన తొలి ఎన్నికల్లోనే ఆయన ముఖ్యమంత్రి కానుండడం గమనార్హం.

మరోవైపు సినీ నటి త్రిష ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా ఈ ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె తిరుమల నుంచి చెన్నై చేరుకున్నారు. కాసేపటి క్రితం ఆమె చెన్నైలోని విజయ్ నివాసానికి వెళ్లారు. ఘన విజయం సాధించబోతున్న విజయ్ కు అభినందనలు తెలియజేశారు. 
Go Back to Shorts
Vijay
Tamil Nadu Assembly Elections
TVK Party
Trisha
Tamil Cinema
Chennai
MGR
Jayalalitha

More Telugu News