దూసుకుపోతున్న టీవీకే.. విజయ్ ఇంటి వద్ద భద్రత పెంపు

Vijay TVK surge leads to increased security at his residence
  • 100కి పైగా స్థానాల్లో లీడ్ లో ఉన్న విజయ్ టీవీకే పార్టీ
  • తమిళనాడులో మారుతున్న రాజకీయ ముఖచిత్రం
  • విజయ్ ఇంటివైపు వాహనాలు వెళ్లకుండా దారి మళ్లింపు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (TVK) సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లోనే అనూహ్యంగా 100కి పైగా స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తూ విజయ్ తన సత్తా చాటుతున్నారు. టీవీకే గెలుపు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయాయి. 


ఈ నేపథ్యంలో విజయ్ నివాసం వద్దకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, తొక్కిసలాటలు జరగకుండా విజయ్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇతర వాహనాలు ఆయన ఇంటి వైపు వెళ్లకుండా దారి మళ్లించి, భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. తమిళనాడులోని మొత్తం 234 స్థానాల్లో టీవీకే సాధిస్తున్న ఈ ఫలితాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Go Back to Shorts
Vijay
Tamilaga Vetri Kazhagam
TVK
Tamil Nadu Elections
Tamil Nadu Assembly Elections 2024
Tamil Politics
Election Results
Actor Vijay
Tamil Nadu Politics
Vijay Political Party

More Telugu News