తమిళనాడు ఫలితాల టెన్షన్.. తిరుమలలో త్రిష పూజలు!

  • విజయ్ పార్టీ టీవీకే గెలుపు కోసం పూజలు చేసినట్లు ప్రచారం
  • పుట్టినరోజు కూడా కావడంతో శ్రీవారిని దర్శించుకున్న నటి
  • తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే మధ్య త్రిముఖ పోరు
  • ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ.. కింగ్ మేకర్‌గా విజయ్?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతున్న వేళ, ప్రముఖ సినీ నటి త్రిష తిరుమల పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఈరోజు ఉదయం ఆమె శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తమిళనాడులో హోరాహోరీగా సాగిన ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో తేలనుండగా, ఈ దర్శనం ప్రాధాన్యం సంతరించుకుంది.

నటుడు విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీ ఈ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తుండటంతో, ఆయన విజయం కోసమే త్రిష శ్రీవారిని ప్రార్థించినట్లుగా ప్రచారం జరుగుతోంది. సోమవారం త్రిష పుట్టినరోజు కూడా కావడం మరో విశేషం. ఆదివారం రాత్రే తాను తిరుపతికి ప్రయాణిస్తున్నట్లు త్రిష తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. ఎన్నికల ఫలితాలకు ముందు త్రిష తిరుమల పర్యటన తమిళనాట చర్చనీయాంశంగా మారింది.
 

Trisha
Trisha Krishnan
Tamil Nadu Elections
Vijay Thalapathy
Tamilaga Vetri Kazhagam
TVK Party
Tirumala
Venkateswara Swamy
Assembly Elections
Election Results

More Telugu News