విశాఖలో హైడ్రాలిక్ జాకీల సహాయంతో పైకి లేపుతుండగా కూలిన భవనం ...ఒకరి మృతి

  • గాజువాక ప్రాంతంలోని వికాస్‌నగర్‌లో జరిగిన ఘటన 
  • ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి, పలువురికి గాయాలు
  • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
విశాఖ నగరంలో విషాదం చోటుచేసుకుంది. గాజువాక ప్రాంతంలోని వికాస్‌నగర్‌లో నిన్న సాయంత్రం ఒక భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఒక కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. భవనాన్ని హైడ్రాలిక్ జాకీల సహాయంతో పైకి లేపుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. రోడ్డు లెవల్ కంటే సుమారు రెండు అడుగుల దిగువన ఉన్న ఈ భవనం ఎత్తు పెంచేందుకు యజమాని ఒక కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. ఈ పనుల్లో భాగంగా ఎనిమిది నుంచి పది మంది కార్మికులు పాల్గొన్నారు. అయితే, ఎలాంటి ఇంజనీరింగ్ పర్యవేక్షణ లేకుండా, అశాస్త్రీయంగా జాకీలతో భవనాన్ని పైకి లేపే ప్రయత్నం చేయడంతో అది ఒక్కసారిగా కుప్పకూలింది.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
 

Visakhapatnam building collapse
Visakhapatnam
Building collapse
Gajuwaka
Accident
Andhra Pradesh
Hydraulic jacks
Construction accident
Labourer death

More Telugu News