Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సునీల్ నరైన్ ఒకే ఒక్కడు... ఒకే ఫ్రాంచైజీ తరఫున 200 వికెట్లు

Sunil Narine First Bowler With 200 Wickets for One IPL Franchise
Advertisement
  • ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన సునీల్ నరైన్
  • ఈ ఘనత సాధించిన మూడో బౌలర్, తొలి విదేశీ ఆటగాడు
  • ఒకే ఫ్రాంచైజీ తరఫున 200 వికెట్లు తీసిన మొట్టమొదటి ప్లేయర్
  • సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌ను ఔట్ చేసి రికార్డు సాధన
  • నరైన్, చక్రవర్తి స్పిన్‌కు సన్‌రైజర్స్ 165 పరుగులకే ఆలౌట్
Advertisement
కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ ఐపీఎల్ చరిత్రలో ఓ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఈ లీగ్‌లో 200 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా, తొలి విదేశీ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ముఖ్యంగా, ఒకే ఫ్రాంచైజీ తరఫున 200 వికెట్ల ఘనత సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో  సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేసింది. ట్రావిస్ హెడ్ (28 బంతుల్లో 61), ఇషాన్ కిషన్ (42) రాణించడంతో పవర్‌ప్లేలో 71/1 స్కోర్‌తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. అయితే, ఇన్నింగ్స్ మధ్యలో ఇషాన్ కిషన్‌ను ఔట్ చేయడం ద్వారా నరైన్ తన 200వ వికెట్‌ను పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో నరైన్ 2/31 గణాంకాలతో సత్తా చాటాడు.

నరైన్‌కు తోడు వరుణ్ చక్రవర్తి (3/36) కూడా చెలరేగడంతో సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ కుప్పకూలింది. కార్తీక్ త్యాగి రెండు వికెట్లు తీయగా, కామెరాన్ గ్రీన్, వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్ తలో వికెట్ పడగొట్టారు. దీంతో సన్‌రైజర్స్ 19 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్ అయింది.

2012లో కేకేఆర్ తరఫున అరంగేట్రం చేసిన నరైన్, అప్పటి నుంచి అదే జట్టుకు ఆడుతున్నాడు. కేకేఆర్ మూడుసార్లు (2012, 2014, 2024) టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2012లో పర్పుల్ క్యాప్, 2012, 2018లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (ఎంవీపీ) అవార్డులను గెలుచుకున్నాడు. ఈ తాజా మైలురాయితో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన బౌలర్లలో ఒకడిగా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు.
Advertisement
Advertisement
Sunil Narine
KKR
Kolkata Knight Riders
IPL
IPL 2024
Indian Premier League
SRH
Sunrisers Hyderabad
Varun Chakravarthy
Cricket

More Telugu News