వివాహం జరిగి 2 నెలలు కూడా కాలేదు.. నవదంపతుల ఆత్మహత్య

Karthik and Manjula Newly Married Couple Commit Suicide in Hyderabad
  • హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో విషాద ఘటన
  • మార్చి 8వ తేదీన వివాహం చేసుకున్న కార్తీక్, మంజుల
  • ఉరివేసుకుని భర్త, విషం తాగి భార్య బలవన్మరణం
హైదరాబాద్‌లో నవదంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. పెళ్లి చేసుకుని రెండు నెలలు కూడా తిరగకముందే ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఈ విషాద సంఘటన జరిగింది. కూకట్‌పల్లిలో ఉంటున్న కార్తీక్, మంజుల గత మార్చి 8వ తేదీన వివాహం చేసుకున్నారు. అయితే ఏమయిందో కానీ భర్త కార్తీక్ ఉరివేసుకోగా, భార్య మంజుల విషం తాగి ఆత్మహత్య చేసుకుంది.

ఈరోజు ఉదయం వారు ఉన్న ఇంటి తలుపు ఎంతసేపటికీ తీయకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు వెళ్ళి చూశారు. భార్యాభర్తలు విగతజీవులుగా పడి ఉండటాన్ని గమనించారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారి మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Go Back to Shorts
Karthik
Karthik Manjula
Hyderabad Suicide
Kukatpally Suicide
Newly Married Couple Suicide

More Telugu News