ఏప్రిల్‌లో ఏపీ ఖజానాకు పన్నుల పంట.. రూ. 5,543 కోట్ల రికార్డ్ వసూళ్లు
- ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో రూ.5,543 కోట్ల పన్నుల వసూళ్లు
- జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే అత్యధిక నెలవారీ ఆదాయం
- గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే 12.08 శాతం వృద్ధి నమోదు
ఆంధ్రప్రదేశ్‌లో పన్నుల వసూళ్లు సరికొత్త రికార్డు సృష్టించాయి. 2026 ఏప్రిల్ నెలలో రాష్ట్ర ఖజానాకు ఏకంగా రూ. 5,542.7 కోట్ల ఆదాయం సమకూరింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఒకే నెలలో ఈ స్థాయిలో ఆదాయం రావడం ఇదే తొలిసారి. గతేడాది ఏప్రిల్‌లో వసూలైన రూ. 4,946 కోట్లతో పోలిస్తే ఇది 12.08 శాతం అధికం కావడం గమనార్హం.
ఈ గణనీయమైన వృద్ధికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడమే కీలక కారణమని రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ అహ్మద్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత డేటా విశ్లేషణ, యూపీఐ లావాదేవీల పర్యవేక్షణ, డిస్కమ్‌ల డేటాతో జీఎస్టీ రిజిస్ట్రేషన్ల ధ్రువీకరణ వంటి సంస్కరణలు సత్ఫలితాలు ఇచ్చినట్లు ఆయన వివరించారు. పన్నుల లీకేజీని అరికట్టి, పన్ను పరిధిని విస్తరించడంలో ఈ విధానాలు ఎంతో దోహదపడ్డాయని పేర్కొన్నారు.
విభాగాల వారీగా చూస్తే... నికర జీఎస్టీ వసూళ్లు 6.83 శాతం వృద్ధితో రూ. 3,796.91 కోట్లకు చేరాయి. పెట్రోలియంపై వ్యాట్ వసూళ్లలో ఏకంగా 26.72 శాతం వృద్ధి నమోదై, రూ. 1,613.36 కోట్లుగా ఉంది. ఇక వృత్తి పన్ను ద్వారా రూ. 42.9 కోట్లు సమకూరాయి. మొత్తం మీద గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈసారి రూ. 598 కోట్ల అదనపు ఆదాయం ప్రభుత్వానికి లభించింది.