పటాన్‌చెరులో రోడ్డుపై ఖరీదైన హస్కీ జాతి శునకాలు.. వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు

Telangana
Advertisement
  • ఎండ వేడికి తట్టుకోలేక ఒకటి మృతి, పలు కుక్కలకు అస్వస్థత
  • జంతు ప్రేమికుల చొరవతో 8 శునకాలను కాపాడిన వైనం
  • ఘటనపై మిస్టరీ, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
  • మిగిలిన వాటి ఆచూకీ కోసం వలంటీర్ల గాలింపు
Advertisement
నగర శివార్లలో అత్యంత అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఖరీదైన సైబీరియన్ హస్కీ జాతికి చెందిన సుమారు 30 నుంచి 40 శునకాలను గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డుపై వదిలివెళ్లారు. ఎండ వేడిమికి తట్టుకోలేక, ఆహారం, నీరు లేక అవి తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. ఈ ఘటనలో ఒక శునకం ప్రాణాలు కోల్పోయింది.

పటాన్‌చెరు-శంకర్‌పల్లి మార్గంలో ఏప్రిల్ 21న గుర్తుతెలియని వ్యక్తులు ఓ కంటైనర్‌లో ఈ శునకాలను తెచ్చి వదిలి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. చల్లని వాతావరణాన్ని ఇష్టపడే ఈ జాతి కుక్కలు, తీవ్రమైన ఎండలకు తాళలేక నీరసించిపోయాయి. వాటి రూపం నక్కలను పోలి ఉండటంతో చాలామంది దగ్గరికి వెళ్లేందుకు భయపడ్డారు.

సమీపంలోని ఓ దుకాణదారుడి సమాచారంతో 'ఆసరా ఫౌండేషన్' సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు వచ్చేసరికే ఎండ నుంచి తప్పించుకునేందుకు కొన్ని కుక్కలు సమీప అడవిలోకి పారిపోగా, మరికొన్నింటిని వాహనదారులు తీసుకెళ్లారు. అక్కడ అస్వస్థతతో పడి ఉన్న 8 శునకాలను వలంటీర్లు రక్షించారు. ప్రస్తుతం వాటిని 'స్వాన్ ఎన్జీవో' సంరక్షణ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అసలు ఇంత పెద్ద సంఖ్యలో ఖరీదైన శునకాలను ఎందుకు వదిలివెళ్లారనేది మిస్టరీగా మారింది. అక్రమ బ్రీడింగ్ కేంద్రాల నిర్వాహకులు అధికారుల తనిఖీల భయంతో వదిలించుకున్నారా? లేక వాటికి ఏమైనా అనారోగ్యం సోకిందా? అనే కోణాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ విజయకృష్ణ తెలిపారు. మిగిలిన శునకాల ఆచూకీ కోసం వలంటీర్లు గాలిస్తున్నారు. అవి ఎక్కడైనా కనిపిస్తే వెంటనే 9949872527 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని జంతు పరిరక్షణ సంస్థ ప్రతినిధులు ప్రజలను కోరారు.
Advertisement

సంబంధిత వార్తలు

Husky DogsAbandonedPatancheruHyderabadTelangana

More Telugu News

ఏపీ పుర పోరు: కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై కూటమి జెండాల రెపరెపలు

03 Nov, 23:53

కూటమి పాలనకు ప్రజల పట్టం.. ఇది అమూల్యమైన తీర్పు: పవన్ కల్యాణ్

03 Nov, 23:09

హైదరాబాద్‌లో భారీ ఫేక్ కరెన్సీ రాకెట్.. రూ.6.78 కోట్ల నకిలీ నోట్ల పట్టివేత

03 Nov, 22:55

'ఓం' మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్.. శ్రీలీల క్యారెక్టర్ ఇదే!

03 Nov, 22:49

రాహుల్ గాంధీ నిద్రపోతున్న పోస్టర్లు.. కోల్‌కతా సాల్ట్ లేక్ లో కలకలం!

03 Nov, 22:41

విశాఖ మేయర్ పీఠం టీడీపీ కూటమి కైవసం.. వరుదు కల్యాణిపై భారీ ఆధిక్యంతో ముక్కా శ్రావణి విజయం

03 Nov, 21:47

ఏసీబీ వలలో మెప్మా ఏడీ.. ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, ఆస్తిపత్రాలు గుర్తింపు

03 Nov, 21:28

టీమిండియాకు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ నిరూపించుకుని న్యూజిలాండ్ బయల్దేరిన ప్రసిద్ధ్ కృష్ణ

03 Nov, 21:13

ఇది సంబరాలకు కాదు, సేవకు సమయం: పురపాలిక తీర్పుపై నారా లోకేశ్

03 Nov, 20:49

కడప జిల్లాలో 4 మున్సిపాలిటీలు టీడీపీ కైవసం.. బీజేపీ ఖాతాలో ఒకటి!

03 Nov, 20:41

మురసు తుపాను ఎఫెక్ట్.. చిలకలూరిపేట హైవేపై వరద నీరు, విజయవాడలో ఎడతెరిపిలేని వాన

03 Nov, 20:27

రష్మిక హిందీ యాసపై విమర్శలు.. అండగా నిలిచిన బాలీవుడ్ నటి

03 Nov, 20:16

జగన్ పాలనను జనం మర్చిపోలేదు.. ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా తీర్పు కూటమికే: పల్లా శ్రీనివాసరావు

03 Nov, 20:10

కంగ్రాట్స్ చంద్రబాబు టీమ్!: జగన్

03 Nov, 19:31

అన్ని అపోహలు పటాపంచలు.. సౌర తుపానుల గుట్టు విప్పిన ఆదిత్య-ఎల్1

03 Nov, 19:14
..More Telugu News