రూ.4.70 కోట్ల జీఎస్టీ చెల్లించాలంటూ కారు డ్రైవర్‌కు నోటీసు.. ఏం జరిగిందంటే?

Tamilnadu Car drivers gets GST notices
  • తమిళనాడులోని వేలూరుకు చెందిన కారు డ్రైవర్‌కు నోటీసు
  • నోటీసు చూసి అవాక్కైన కారు డ్రైవర్ కమల్‌నాథ్
  • అతని పాన్, ఆధార్ కార్డులను ఉపయోగించి ఇతరులు సంస్థలు నడిపినట్లు గుర్తించిన అధికారులు
తమిళనాడులోని ఒక కారు డ్రైవర్‌కు రూ.4.70 కోట్ల జీఎస్టీ చెల్లించాలని నోటీసులు వచ్చాయి. తనకు అందిన నోటీసులు చూసి కారు డ్రైవర్ అవాక్కయ్యాడు. తమిళనాడులోని వేలూరుకు చెందిన కమల్‌నాథ్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతను పదేళ్లుగా తిరువేర్కాడులో భార్య, పిల్లలతో కలిసి ఉంటున్నాడు.

అయితే ఇటీవల, జీఎస్టీ కార్యాలయం నుంచి ఆయన ఇంటికి నోటీసు వచ్చింది. ఆ నోటీసును తెరిచి చూడగా, రూ.4.70 కోట్ల జీఎస్టీ చెల్లించాలని ఉంది. దీనితో దిగ్భ్రాంతికి గురైన కమల్‌నాథ్ జీఎస్టీ కమిషనర్ కార్యాలయాన్ని సంప్రదించాడు. అయితే అతని పాన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలను ఉపయోగించి, గుర్తు తెలియని వ్యక్తి జీఎస్టీ రిజిస్టర్ చేసి, హోసూర్, తిరుప్పూరులో సంస్థలు నడిపినట్లు అధికారులు గుర్తించారు. కొన్నాళ్లకు ఆ సంస్థలను అతడు మూసివేసినట్లు తెలుసుకున్నారు.
Go Back to Shorts
Tamilnadu Car drivers gets GST notices
GST notices

More Telugu News