మైక్రోఫైనాన్స్ కేసులో సంచలనం... మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మైక్రోఫైనాన్స్ కేసులో సంచలనం... మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు!

Mangli Brother account gets money from Ramavath Madhu
  • శివచౌహాన్ ఖాతాలను పరిశీలించగా మూడుసార్లు డబ్బులు వచ్చినట్లు గుర్తింపు
  • రమావత్ మధు బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు వచ్చినట్లు గుర్తింపు
  • నిందితుల బ్యాంకు ఖాతా వివరాలను కోరుతూ పోలీసుల లేఖ
గాయని మంగ్లీ ఆరోపణలు ఎదుర్కొంటున్న మైక్రో ఫైనాన్స్ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా మంగ్లీ సోదరుడు శివచౌహాన్ బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలించగా, మూడుసార్లు డబ్బులు వచ్చినట్లు గుర్తించారు.

రమావత్ మధు బ్యాంకు ఖాతా నుంచి శివ అకౌంట్‌కు పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చాయని తెలిపారు. దీనితో రమావత్ మధు బ్యాంకు ఖాతాను పోలీసులు జప్తు చేశారు. మధు, హిమకాంత్ రెడ్డి, శివ చౌహాన్‌ల బ్యాంకు ఖాతా వివరాలను అందజేయాలని బ్యాంకులకు పోలీసులు లేఖ రాశారు.

మైక్రో ఫైనాన్స్ పేరిట అధిక లాభాలు వస్తాయని నమ్మించి మంగ్లీ, ఆమె సోదరుడు, మరికొంతమంది కలిసి కోట్లాది రూపాయలు మోసం చేశారని సికింద్రాబాద్‌కు చెందిన న్యాయవాది సుబ్బారావు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై తాను మంగ్లీని సంప్రదించే ప్రయత్నం చేయగా ఆమె బెదిరింపులకు పాల్పడిందని చెబుతూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో మంగ్లీ, ఆమె సోదరుడితో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు, తన పేరును ఉపయోగించుకుని సుబ్బారావు ప్రాచుర్యం పొందాలని చూస్తున్నారని ఆరోపిస్తూ మంగ్లీ కూడా ఫిర్యాదు చేశారు.
Advertisement
Mangli Brother account gets money from Ramavath Madhu
Ramavath Madhu

More Telugu News