ఏపీకి భారీగా నిధులు మంజూరు చేసిన కేంద్రం.. కేంద్ర మంత్రి పెమ్మసాని స్పందన

Union minister Pemmasani expresses happy on Central govt funds release
  • జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏపీకి రూ. 1,192 కోట్ల నిధులు మంజూరు
  • నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని
  • గ్రామీణ కుటుంబాలకు ఆదాయ భరోసా కల్పించడమే తమ లక్ష్యమని వెల్లడి

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏపీకి కేంద్ర ప్రభుత్వం రూ. 1,192.16 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధుల్లో సింహభాగం, అంటే రూ. 1,123.15 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్ కింద కేటాయించారు. దీనివల్ల గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, చెరువుల పూడికతీత వంటి శాశ్వత ప్రాతిపదికన నిర్మించే పనులకు ఊతం లభిస్తుంది. మిగిలిన రూ. 69.01 కోట్లు అడ్మిన్ కాంపోనెంట్ కోసం వినియోగించనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ నిధులు ముందుగానే మంజూరు కావడం గమనార్హం.


కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేశారు. లక్షలాది మంది కూలీలకు వేతనాలు నేరుగా అందేలా పారదర్శక వ్యవస్థను బలోపేతం చేస్తామని, పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ముఖ్యంగా, గ్రామీణ కుటుంబాలకు ఆదాయ భరోసా కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.


కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకుపోతోందని పెమ్మసాని అన్నారు. కేంద్రం విడుదల చేసిన ఈ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తామని తెలిపారు. నిన్ననే దీనదయాళ్‌ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌ పథకం కింద రూ. 207 కోట్లు విడుదల కాగా, నేడు ఉపాధి హామీ నిధులు రావడం... రాష్ట్ర అభివృద్ధిపై కేంద్రం చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధను ప్రతిబింబిస్తోంది.

Go Back to Shorts
Pemmasani
TDP
MGNREGA

More Telugu News