డీజీపీగా పదవీ విరమణ చేసిన వెంటనే.. శివధర్ రెడ్డికి కీలక బాధ్యతలను అప్పగించిన ప్రభుత్వం

డీజీపీగా పదవీ విరమణ చేసిన వెంటనే.. శివధర్ రెడ్డికి కీలక బాధ్యతలను అప్పగించిన ప్రభుత్వం

TG Govt appoints Ex DGP Sivadhar Reddy as State Security Advosor
  • డీజీపీగా నేడు పదవీ విరమణ చేసిన శివధర్ రెడ్డి
  • రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుగా నియామకం
  • చీఫ్ సెక్రటరీ హోదాలో కీలక పదవి
  • నెలకు రూ. 2.25 లక్షల వేతనం, ప్రత్యేక కార్యాలయం

తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి ఈరోజు పదవీ విరమణ పొందిన సంగతి తెలిసిందే. పదవీ విరమణ పొందిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఆయనకు కీలక బాధ్యతలను అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుగా ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన సేవలు రాష్ట్రానికి మరింత కాలం అవసరమని ప్రభుత్వం భావించినట్లు ఈ నిర్ణయం ద్వారా స్పష్టమవుతోంది.


రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుగా శివధర్ రెడ్డిని చీఫ్ సెక్రటరీ (సీఎస్) హోదాతో ఈ పదవిలో నియమించారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. శాంతిభద్రతల పరిరక్షణ, అంతర్గత భద్రత, నేర నియంత్రణతో పాటు ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు అయిన నార్కోటిక్స్ కంట్రోల్ (డ్రగ్స్ నియంత్రణ), రోడ్డు భద్రత వంటి అంశాలపై ఆయన ప్రభుత్వానికి నేరుగా సలహాలు అందించనున్నారు.

వేతన సదుపాయాలు, కార్యాలయం:

  • వేతనం: నెలకు రూ. 2.25 లక్షల వేతనంతో పాటు రూ. 50,000 ఇంటి అద్దె భత్యం.

  • సౌకర్యాలు: ప్రభుత్వ వాహనం, టీఏ/డీఏ, మెడికల్ రీయింబర్స్‌మెంట్ సౌకర్యాలు ఆయనకు లభిస్తాయి.

  • సిబ్బంది: హోంశాఖ ఆయన కోసం ఒక ఓఎస్‌డీ, ప్రైవేట్ సెక్రటరీ, ఇద్దరు డ్రైవర్లు, నలుగురు ఆఫీస్ సబార్డినేట్లతో కూడిన ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది.

Advertisement
Sivadhar Reddy
State security advisor

More Telugu News