బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందా? వైభవ్ సూర్యవంశీ ఏం చెప్పాడో చూడండి!
- తన బ్యాటింగ్‌లో ఏఐ చిప్ ఉందన్న ప్రచారంపై స్పందించిన వైభవ్ సూర్యవంశీ
- అది దేవుడు ఇచ్చిన శక్తి అనిసరదాగా వ్యాఖ్యానించిన యువ బ్యాటర్
- పాక్ అనలిస్ట్ నౌమాన్ నియాజ్ వ్యాఖ్యలతో మొదలైన చర్చ
- ఈ సీజన్‌లో 400 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచిన వైభవ్
రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన బ్యాట్‌లో 'ఏఐ చిప్' ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై సరదాగా, హుందాగా స్పందించాడు. తన అద్భుతమైన పవర్‌కు కారణం దేవుడిచ్చిన వరమేనని, ఇందులో ఎలాంటి రహస్యం లేదని తేల్చిచెప్పాడు.
పాకిస్థాన్ క్రీడా విశ్లేషకుడు నౌమాన్ నియాజ్ సరదాగా చేసిన వ్యాఖ్యలతో ఈ చర్చ మొదలైంది. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చూసి ఆశ్చర్యపోయిన అతడు, "ఈ కుర్రాడి బ్యాట్‌ను ల్యాబ్‌లో టెస్ట్ చేయాలి. బహుశా అతని బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందేమో" అని 'స్మాష్ హిట్' అనే షోలో వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో రాజస్థాన్ రాయల్స్ దీనిపై ఒక వీడియోను విడుదల చేసింది.
ఈ వీడియోలో వైభవ్ మాట్లాడుతూ, "ఆ శక్తిని నాకు దేవుడే ఇచ్చాడు. నా బ్యాట్‌లో ఏదో ఉందని ఆయనే చెప్పాడు. నేను దాన్ని ఉపయోగిస్తున్నాను అంతే" అని నవ్వుతూ సమాధానమిచ్చాడు. ఎంతో కూల్ గా, చమత్కారంతో కూడిన సూర్యవంశీ సమాధానం అందరినీ ఆకట్టుకుంది.
మంగళవారం నాడు పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ కేవలం 16 బంతుల్లో 43 పరుగులు చేసి మరోసారి తన సత్తా చాటాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌ల్లో 44.44 సగటు, 238.10 స్ట్రైక్ రేట్‌తో 400 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి స్టార్లను వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్‌ను వైభవ్ సొంతం చేసుకున్నాడు.