ముంబై ఓపెనర్ రికెల్టన్ శతక విధ్వంసం... సన్ రైజర్స్ ముందు కొండంత లక్ష్యం
- వాంఖడేలో రికెల్టన్ మెరుపు సెంచరీ
- సన్‌రైజర్స్ బౌలర్లను ఊచకోత కోసిన ముంబై బ్యాటర్లు
- 20 ఓవర్లలో 243 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్
- రికెల్టన్కు తోడుగా విల్ జాక్స్, హార్దిక్ మెరుపులు
- హైదరాబాద్ ముందు 244 పరుగుల భారీ టార్గెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో పరుగుల వరద కొనసాగుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా, వికెట్ కీపర్ బ్యాటర్ ర్యాన్ రికెల్టన్ అద్భుతమైన సెంచరీతో కదం తొక్కాడు. కేవలం 55 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లతో అజేయంగా 123 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. రికెల్టన్ వీరవిహారానికి తోడు ఇతర బ్యాటర్లు కూడా రాణించడంతో, ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్ ఆరంభం నుంచే సన్‌రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా విల్ జాక్స్ (22 బంతుల్లో 46) తనదైన శైలిలో బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు కేవలం 7.1 ఓవర్లలోనే 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని నితీశ్ రెడ్డి విడదీశాడు.
జాక్స్ ఔటైన తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (5) నిరాశపరిచినా, రికెల్టన్ మాత్రం తన జోరును కొనసాగించాడు. మరోవైపు, నమన్ ధీర్ (17 బంతుల్లో 22), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 31) తమ వంతు సహకారం అందించారు. ముఖ్యంగా, హార్దిక్ పాండ్యా రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే, రికెల్టన్ ఇన్నింగ్స్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి చివరి బంతి వరకు దూకుడును ప్రదర్శిస్తూ, మైదానం నలువైపులా షాట్లు కొట్టాడు. 223.64 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి సన్‌రైజర్స్ బౌలర్లను హడలెత్తించాడు. చివరి వరకు నాటౌట్‌గా నిలిచి ముంబై ఇన్నింగ్స్‌ను భారీ స్కోరుతో ముగించాడు.
సన్‌రైజర్స్ బౌలర్లలో ప్రఫుల్ హింగే రెండు వికెట్లు పడగొట్టినప్పటికీ 4 ఓవర్లలో 54 పరుగులు సమర్పించుకున్నాడు. ఎషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, నితీశ్ కుమార్ రెడ్డి తలో వికెట్ తీశారు. కెప్టెన్ పాట్ కమిన్స్ (0/39) వికెట్ తీయలేకపోయాడు. మిగతా బౌలర్లు కూడా ధారాళంగా పరుగులు ఇవ్వడంతో సన్‌రైజర్స్ ముందు 244 పరుగుల కొండంత లక్ష్యం నిలిచింది.