బెంగాల్‌లో మేం గెలుస్తున్నాం: కోల్‌కతాలో ఓటేసిన అనంతరం మమతా బెనర్జీ
- విజయ చిహ్నం చూపించిన మమతా బెనర్జీ
- మూడింట రెండొంతుల సీట్లు సాధిస్తామని ధీమా
- వారు (బీజేపీ) ఓడిపోతున్నారు, టీఎంసీ గెలుస్తుందన్న మమతా బెనర్జీ
మమతా బెనర్జీ కేంద్ర బలగాలు, పరిశీలకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది, కేంద్ర పరిశీలకులు మహిళలు సహా అందరినీ లక్ష్యంగా చేసుకుంటున్నారని, అమాయకులను కొడుతున్నారని మండిపడ్డారు. మహిళలు, పిల్లలను కూడా వదలడం లేదని ఆరోపించారు. నిన్న రాత్రి నుంచి ఘోరాలకు పాల్పడ్డారని అన్నారు. ఎంతోమంది టీఎంసీ మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారని మమతా బెనర్జీ అన్నారు.