బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోంది, ఈసీ అధికారులు ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారు: మమతా బెనర్జీ
- భవానీపూర్ నియోజకవర్గాలో తారసపడిన మమతా బెనర్జీ, సువేందు అధికారి
- కేంద్ర బలగాలు కార్యకర్తల ఇళ్లలోకి జొరబడి ఓటర్లను భయపెడుతున్నాయన్న మమతా బెనర్జీ
- బీజేపీ, ఈసీ ప్రజాస్వామ్య పండుగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని విమర్శ
పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న రెండో దశ పోలింగ్‌లో రిగ్గింగ్ జరుగుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. తాను బరిలో నిలిచిన భవానీపూర్ నియోజకవర్గానికి మమతా బెనర్జీ వెళ్లారు. అదే సమయంలో ఆమెపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కూడా అక్కడకు వచ్చారు. మమతా బెనర్జీని చూసిన సువేందు "ఆమెను చూడండి. ఈరోజు ఆమెకు ఎవరూ ఓటు వేయడం లేదు" అని వ్యాఖ్యానించారు.
దీనితో బీజేపీ, ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బలగాలకు చెందిన సభ్యులు తమ పార్టీ కార్యకర్తల ఇళ్లలోకి జొరబడి, ఓటర్లను భయపెడుతున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని మండిపడ్డారు. ఎన్నికల సంఘం ప్రతినిధులు ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను రాత్రి కొట్టారని, ఇదేం గూండాయిజమని ప్రశ్నించారు.
ఓటింగ్ ఇలా జరగకూడదని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఎన్నికలు అంటే ప్రజాస్వామ్య పండుగ అని, కానీ వారు పండుగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. మరోవైపు, సువేందు అధికారి కూడా మమతా బెనర్జీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె గూండాలను వెంటేసుకుని తిరుగుతూ ఓటర్లను భయపెడుతున్నారని ఆరోపించారు.