చారిత్రక చిత్రాలకు బదులు ట్రంప్ ఫొటో.. యూఎస్ పాస్‌పోర్టుల్లో కీలక మార్పు
- అమెరికా పాస్‌పోర్టులపై కనిపించనున్న ట్రంప్ ఫొటో, బంగారు సంతకం
- స్వాతంత్ర్య దినోత్సవ 250వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఎడిషన్
- అధికారంలో ఉన్న నేత ఫొటో పాస్‌పోర్టుపై ముద్రించడం అరుదైన ఘటన
- ఇప్పటికే పలు ప్రభుత్వ సంస్థలపై ట్రంప్ తనదైన ముద్ర వేసిన వైనం
- వాషింగ్టన్‌లో మాత్రమే పరిమిత సంఖ్యలో ఈ పాస్‌పోర్టుల జారీ
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరో అసాధారణ నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. ప్రభుత్వ సంస్థలపై తనదైన ముద్ర వేస్తున్న ఆయన, ఇప్పుడు అమెరికన్ పాస్‌పోర్టులపై కూడా తన ఫొటో, సంతకాన్ని ముద్రించనున్నారు. ఈ చర్యతో దశాబ్దాలుగా పాటిస్తున్న ఓ సంప్రదాయానికి తెరదించినట్టయింది. అమెరికా స్వాతంత్ర్య ప్రకటనకు 250 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ ప్రత్యేక పాస్‌పోర్టులను విడుదల చేయనున్నట్టు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ మంగళవారం అధికారికంగా ధ్రువీకరించింది.
ఫాక్స్ న్యూస్, ది బుల్వార్క్‌లో వచ్చిన కథనాల తర్వాత స్టేట్ డిపార్ట్‌మెంట్ ఈ ప్రకటన చేసింది. ఈ కొత్త పాస్‌పోర్టు లోపలి పేజీల్లో రెండు చిత్రాలు ఉండనున్నాయి. ఒక చిత్రంలో అమెరికా స్వాతంత్ర్య ప్రకటన పత్రంపై ట్రంప్ అధికారిక ఫొటో, దాని కింద బంగారు రంగులో ఆయన సంతకం ఉంటాయి. రెండో చిత్రంలో అమెరికా జాతిపితల చారిత్రక పెయింటింగ్ ఉంటుంది. జులైలో అమెరికా 250వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ, ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని పరిమిత సంఖ్యలో ఈ ప్రత్యేక పాస్‌పోర్టులను విడుదల చేస్తున్నట్టు స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి టామీ పిగోట్ తెలిపారు.
ఈ లిమిటెడ్ ఎడిషన్ పాస్‌పోర్టులను అదనపు రుసుము లేకుండా కేవలం వాషింగ్టన్‌లో మాత్రమే అందుబాటులో ఉంచుతామని, స్టాక్ ఉన్నంతవరకే ఇవి లభిస్తాయని ఓ అధికారి వెల్లడించారు.
ప్రజాస్వామ్య దేశాల్లో అధికారంలో ఉన్న నేతల చిత్రాలను పాస్‌పోర్టులపై ముద్రించడం అత్యంత అరుదు. చాలా దేశాలు తమ చారిత్రక ప్రదేశాలు, ప్రకృతి సౌందర్యం లేదా జాతీయ చిహ్నాలను ఉపయోగిస్తాయి. ప్రస్తుత అమెరికా పాస్‌పోర్టుల్లో కూడా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, చంద్రుడిపై కాలు మోపిన చారిత్రక ఘట్టం వంటి చిత్రాలు ఉన్నాయి.
గతేడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రంప్ ప్రభుత్వ సంస్థలపై తన వ్యక్తిగత ముద్రను బలంగా వేస్తున్నారు. రాజధానిలోని పలు ప్రభుత్వ భవనాలపై ఆయన బ్యానర్లు ఏర్పాటు చేశారు. కెన్నడీ సెంటర్‌కు కూడా ఆయన పేరును జోడించారు. అంతేగాక గత నెలలో డాలర్ నోట్లపై ట్రంప్ సంతకం కూడా ముద్రించనున్నట్టు ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ప్రకటించడం సంచలనంగా మారింది. సాధారణంగా బ్రిటన్ వంటి దేశాల్లో దేశాధినేతగా రాజు చిత్రం కరెన్సీపై ఉన్నా, వారు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనరన్న విషయం తెలిసిందే.