దేశంలో వద్దన్నారు.. విదేశాల్లో అదే ప్రీమియం: ఆస్ట్రేలియాలోని భారత మహిళ వీడియో వైరల్
- ఆస్ట్రేలియాలో ఉంటున్న భారత మహిళకు ఎదురైన అనుభవం
- దేశంలో వద్దనుకున్న పసుపు పాలను విదేశాల్లో డాలర్లు పెట్టి కొంటున్నామన్న స్మిధ
- మన సంప్రదాయాలను మనమే పాతవిగా భావిస్తున్నామని ఆవేదన
- ఆమె అభిప్రాయంతో ఏకీభవిస్తూ సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్లు
ఆస్ట్రేలియాలో నివసిస్తున్న స్మిధ అనే భారతీయ మహిళ సోషల్ మీడియాలో పంచుకున్న ఓ అనుభవం ప్రస్తుతం ఇంటర్నెట్లో చర్చనీయాంశంగా మారింది. స్వదేశంలో ఉన్నప్పుడు మనం తేలికగా తీసుకునే ఎన్నో సంప్రదాయాలు, అలవాట్లకు విదేశాల్లో ఎంత విలువ ఉందో ఆమె తన వీడియో ద్వారా వివరించారు. భారతదేశంలో "టూ దేశీ"గా భావించే అంశాలు విదేశాల్లో ఎలా "ప్రీమియం"గా మారతాయో ఆమె చెప్పిన తీరు ఎంతోమందిని ఆకట్టుకుంటోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసిన వీడియోలో.. విదేశానికి వెళ్లాక తనలో కలిగిన మార్పు గురించి ప్రస్తావించారు. ఒకరోజు తన ఇంటి దగ్గర్లోని కేఫ్‌కు వెళ్లగా, అక్కడ 'టర్మరిక్ లాటే' కోసం జనం క్యూలో నిల్చోవడం చూశానని, దాని ధర 8 డాలర్లు అని తెలిపారు. ఆ క్యూలో తను కూడా నిల్చున్నప్పుడు ఒక విషయం గుర్తుకొచ్చి ఇబ్బందిగా అనిపించిందని ఆమె చెప్పారు. "ఒకప్పుడు మా అమ్మ ఇంట్లో రోజూ పసుపు పాలు చేసి ఇచ్చేది. కానీ, నేను తాగకుండా తప్పించుకునేదాన్ని. అవే పదార్థాలు, అవే పాలు, అదే వెచ్చదనం.. కానీ అప్పుడు అది నాకు నచ్చేది కాదు" అని ఆమె గుర్తుచేసుకున్నారు.
ఇదే తరహాలో మరో ఉదాహరణ కూడా పంచుకున్నారు. ఇంట్లో ఎవరూ పట్టించుకోని ఓ చేనేత దుపట్టా ఉండేదని, కానీ అలాంటి వస్తువులే ఇప్పుడు విదేశాల్లోని స్టోర్లలో అధిక ధరలకు అమ్ముడవుతున్నాయని గమనించానని తెలిపారు. "మనం పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడి మన సంప్రదాయాలను కోల్పోవడం లేదు. మన సంస్కృతి విలువను మనమే గుర్తించడం మానేస్తున్నాం. ఇక్కడ పాతకాలం పద్ధతులని ముద్ర వేసిన వాటికే, విదేశాల్లో ఎంతో విలువ ఇస్తున్నారు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
స్మిధ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమె అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవించారు. "మీరు చెప్పింది నూటికి నూరు పాళ్లు నిజం" అని ఒకరు కామెంట్ చేయగా, "భారత్‌లో కంటే విదేశాల్లోనే యోగా శిబిరాలు ఎక్కువగా చూశాను" అని మరొకరు పేర్కొన్నారు. ఇంకొకరు "చలికాలంలో పసుపు పాలు ఎంతో మంచివి" అంటూ తమ అనుభవాలను పంచుకున్నారు. మొత్తంగా మన సంప్రదాయాల పట్ల మన దృక్పథం మారాల్సిన అవసరం ఉందని ఈ వీడియో గుర్తుచేస్తోంది.