సీఎం, పవన్‌పై పోస్టుల కేసు.. రెండో రోజూ విచారణకు హాజరైన భార్గవరెడ్డి

Sajjala Bhargava Reddy Investigation Continues in Social Media Posts Case
  • అనుచిత పోస్టుల కేసులో సజ్జల భార్గవరెడ్డి విచారణ
  • రెండో రోజు కూడా విచారణకు హాజరైన భార్గవరెడ్డి
  • పులివెందుల డీఎస్పీ ఎదుట కొనసాగుతున్న విచారణ
  • సీఎం, పవన్, లోకేశ్‌పై పోస్టులు పెట్టినట్లు ఆరోపణలు
  • మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలపై ప్రశ్నిస్తున్న పోలీసులు
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తో పాటు వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డి విచారణ రెండో రోజుకు చేరింది. పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో ఆయన ఆదివారం మరోసారి విచారణకు హాజరయ్యారు.

నిన్న సుదీర్ఘ సమయం పాటు విచారించిన పోలీసులు, ఇవాళ కూడా హాజరుకావాలని ఆదేశించడంతో భార్గవరెడ్డి మధ్యాహ్నం పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ ఎదుట విచారణకు వచ్చారు. ఈ కేసులో ఆయనతో పాటు వర్రా రవీందర్ రెడ్డి, అర్జున్ రెడ్డిలపై కూడా ఆరోపణలు ఉన్నాయి. 2022 నుంచి టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని భార్గవరెడ్డి అసభ్యకర పోస్టులు పెట్టించారని, తాడేపల్లిలోని ఐకాన్ బిల్డింగ్‌ను కేంద్రంగా చేసుకుని 130 మంది కన్వీనర్లతో ఈ కార్యకలాపాలు నడిపారని పోలీసులు గుర్తించారు.

ఈ రోజు విచారణలో భాగంగా మార్ఫింగ్. అశ్లీల ఫొటోలు, ఫోన్ డేటా, ల్యాప్ టాప్ గురించి సైబర్ క్రైమ్ అధికారుల బృందం భార్గవరెడ్డిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌తో పాటు షర్మిల, సునీత, విజయమ్మ వంటి వారిపై కూడా అసభ్యకర పోస్టులు పెట్టించారన్న ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. 2024 నవంబర్ 8న నమోదైన ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.
Go Back to Shorts
Sajjala Bhargava Reddy
Chandrababu Naidu
Pawan Kalyan
Nara Lokesh
YS Sharmila
YS Sunitha
YS Vijayamma
YSRCP Social Media
Pulivendula DSP
Cyber Crime

More Telugu News