అంబానీ ఇంట రిహానా సందడి.. భారతీయ సంస్కృతికి ఫిదా!

Rihanna Visits Ambani Residence Mesmerized by Indian Culture
  • అంబానీ నివాసంలో రిహానాకు ప్రత్యేక ఆతిథ్యం
  • కుటుంబసభ్యులతో కలిసి లంచ్‌లో పాల్గొన్న పాప్ స్టార్
  • భారతీయ కళ, సంస్కృతిపై ఆసక్తి చూపిన రిహానా
  • 'ఫెంటి బ్యూటీ' బ్రాండ్ ప్రమోషన్ కోసం భారత్‌కు రాక
ప్రముఖ పాప్ సింగర్, గ్లోబల్ ఐకాన్ రిహానా ముంబైలోని అంబానీ నివాసంలో సందడి చేశారు. అంబానీ కుటుంబసభ్యులు ఆమెకు ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చి, మధ్యాహ్న విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భారతీయ కళ, సంస్కృతి, నృత్య రూపాల గురించి రిహానా ఆసక్తిగా తెలుసుకున్నారు.

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్, ఈషా అంబానీ, శ్లోకా మెహతా తదితరులు రిహానాకు సాదర స్వాగతం పలికారు. వారితో కలిసి రిహానా భోజనం చేస్తూ సరదాగా ముచ్చటించారు. ఈ విందు కార్యక్రమం కుటుంబసభ్యుల మధ్య అత్యంత ఆత్మీయంగా జరిగింది.

రిలయన్స్ రిటైల్ సంస్థ తన సౌందర్య ఉత్పత్తుల బ్రాండ్ 'ఫెంటి బ్యూటీ' వేడుకల కోసం రిహానాను భారత్‌కు తీసుకువచ్చింది. ఈ బ్రాండ్ ఉత్పత్తులు భారత్‌లో ప్రత్యేకంగా 'టిరా', 'సెఫోరా' స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. ఈ బిజినెస్ టూర్ లో భాగంగానే ఆమె అంబానీ కుటుంబాన్ని మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది.

రిహానా గతంలో అనంత్ అంబానీ ప్రీ వెడ్డిండ్ వేడుకల్లోనూ సందడి చేశారు. 
Go Back to Shorts
Rihanna
Rihanna Ambani
Anant Ambani
Radhika Merchant
Isha Ambani
Shloka Mehta
Fenty Beauty
Reliance Retail
Indian Culture
Mumbai

More Telugu News