పెట్రోల్, డీజిల్ కొరతతో బంకుల మూసివేత.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
- రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ప్యానిక్ కొనుగోళ్లతో 50 శాతానికి పైగా పెరిగిన డిమాండ్
- సరఫరా లేక 400కు పైగా పెట్రోల్ బంకులు మూసివేత
- ప్రజలు ఇబ్బంది పడకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశం
- సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం డెడ్‌లైన్
రాష్ట్రంలో పలుచోట్ల పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడి బంకులు మూతపడుతున్న విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. ముంబై నుంచి అమరావతికి బయలుదేరే ముందు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇంధన లభ్యత, సరఫరాలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీసి, కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా అధికారులు జిల్లాల వారీగా ప్రస్తుత పరిస్థితిని సీఎంకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,510 పెట్రోల్ బంకులు ఉండగా, సరఫరా సమస్యల కారణంగా దాదాపు 421 బంకులు మూతపడినట్లు తెలిపారు. కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో ప్రజలు అవసరానికి మించి కొనుగోలు చేస్తుండటమే (ప్యానిక్ బయింగ్) ఈ పరిస్థితికి ప్రధాన కారణమని అధికారులు పేర్కొన్నారు.
సాధారణ రోజుల్లో రోజుకు 6,330 కిలోలీటర్ల పెట్రోల్, 9,048 కిలోలీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతాయని, కానీ శనివారం ఒక్కరోజే 10,345 కిలోలీటర్ల పెట్రోల్, 14,156 కిలోలీటర్ల డీజిల్ విక్రయాలు జరిగినట్లు అధికారులు వివరించారు. సాధారణంతో పోలిస్తే డిమాండ్ ఒక్కసారిగా 50 శాతానికి పైగా పెరగడంతో, సరఫరా 10 శాతం పెంచినప్పటికీ బంకుల్లో నిల్వలు వేగంగా అయిపోతున్నాయని తెలిపారు. దీంతో అనేక బంకుల వద్ద వినియోగదారులు బారులు తీరుతున్నారని పేర్కొన్నారు.
ముఖ్యంగా ఆక్వా రంగంలో డ్రమ్ముల్లో ఇంధనం కొనుగోలు చేసేవారికి ఎదురవుతున్న సమస్యలను అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన చంద్రబాబు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్లు, మత్స్యశాఖ అధికారులు కలిసి ఒక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలో ఇంధన కొరత నివారణకు తీసుకున్న చర్యలు, సమస్య పరిష్కారంపై సాయంత్రం లోగా తనకు నివేదిక సమర్పించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.