పెళ్లి పేరుతో మోసం.. బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డిపై రూ.9.35 కోట్ల చీటింగ్ కేసు

  • పెళ్లి పేరుతో లండన్ ఇంజనీర్‌ను మోసం చేసినట్టు ఆరోపణ
  • నగదు, 5 కిలోల బంగారం, ఫ్లాట్లు తీసుకుందని ఫిర్యాదు
  • హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
సోషల్ మీడియా, బిగ్‌బాస్‌తో పాప్యులర్ అయిన సినీ నటి అషురెడ్డిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్ద నుంచి రూ.9.35 కోట్లు కాజేసిందని లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వై.వి.ధర్మేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం షేక్‌పేట్‌కు చెందిన ధర్మేంద్ర 2018లో భారత్‌కు వచ్చినప్పుడు అషురెడ్డి (వెంకట అశ్వినిరెడ్డి) పరిచయమైంది. తాను అమెరికాలో చదువుకుని, సినిమా అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చినట్లు ఆమె తెలిపారు. కొద్దిరోజుల్లోనే ప్రేమ పేరుతో దగ్గరై, పెళ్లి చేసుకుంటానని నమ్మించారు. ఆ తర్వాత ఆర్థిక అవసరాల పేరుతో ధర్మేంద్ర నుంచి నగదు, బంగారం, ఆస్తులు కొనుగోలు చేయించుకుని తన పేరు మీదే రిజిస్టర్ చేయించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అషురెడ్డి కుటుంబ సభ్యులు కూడా పెళ్లి సంబంధం ఖాయం చేస్తున్నట్లు హడావుడి చేసి, ఆ తర్వాత ముఖం చాటేశారని బాధితుడు తెలిపారు. ఈ విషయమై ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ మాట్లాడుతూ "2025 వరకు నా కుమారుడి నుంచి అషురెడ్డి రూ.9.35 కోట్ల నగదు, సుమారు 5 కిలోల బంగారం, ఫ్లాట్లు, వాహనాలు కొనుగోలు చేయించుకుంది. ఆమె సోదరి కూడా అదనంగా రూ.50 లక్షలు తీసుకుంది" అని ఫిర్యాదులో వివరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు అషురెడ్డి, ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  

Ashu Reddy
Ashu Reddy cheating case
Big Boss Ashu Reddy
YV Dharmendra
Hyderabad CCS police
cheating case
financial fraud
Telugu actress
software engineer
marriage fraud

More Telugu News