కేజ్రీవాల్ తన ఇంటి నుంచి వెళ్లిన గంటల్లోనే రాజీనామా చేసిన అశోక్ మిట్టల్

Ashok Mittal Resigns Hours After Kejriwal Vacates His House
  • ఏడాది కాలంగా అశోక్ మిట్టల్ నివాసంలో ఉంటున్న కేజ్రీవాల్ కుటుంబం
  • కేజ్రీవాల్‌కు జాతీయ పార్టీ అధినేత కింద భవనం కేటాయింపు
  • నిన్న తనకు కేటాయించిన భవనానికి వెళ్లిపోయిన కేజ్రీవాల్
ఏడాది క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు తన నివాసంలోకి ఘన స్వాగతం పలికిన అశోక్ మిట్టల్, నిన్న కేజ్రీవాల్ తన నివాసాన్ని ఖాళీ చేసిన గంటల్లోనే పార్టీ మారి అధినేతకు షాకిచ్చారు. శుక్రవారం రాఘవ్ చద్దా సహా ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఎంపీలు ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో అశోక్ మిట్టల్ కూడా ఉన్నారు.

ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ గత సంవత్సరం బెయిల్‌పై విడుదలైన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పుడు ఆయన సీఎం నివాసం నుంచి బయటకు వచ్చారు. అశోక్ మిట్టల్ కేజ్రీవాల్ కుటుంబాన్ని తన నివాసంలోకి ఆహ్వానించారు. దీనితో ఏడాది కాలంగా కేజ్రీవాల్, ఆయన కుటుంబం మండీ హౌస్ సమీపంలోని రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్ అధికారిక నివాసంలో ఉంటోంది.

ఏప్రిల్ 24న కేజ్రీవాల్ ఆయన నివాసం నుంచి వెళ్లిపోయారు. జాతీయ పార్టీ అధినేత హోదా కింద లోథి ఎస్టేట్‌లోని బంగ్లాను కేజ్రీవాల్‌కు కేటాయించారు. దీనితో నిన్న ఆయన ఈ భవనంలోకి మారారు. కేజ్రీవాల్ తన భవనం నుంచి వెళ్లిపోయిన కొన్ని గంటల్లోనే అశోక్ మిట్టల్ ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేయడం గమనార్హం. నిన్న రాజీనామా చేసిన వారిలో రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్, హర్భజన్ సింగ్, రాజిందర్ గుప్తా, విక్రమ్ సాహ్నీ, స్వాతి మాలీవాల్ ఉన్నారు.
Go Back to Shorts
Ashok Mittal
Arvind Kejriwal
Aam Aadmi Party
AAP
Raghav Chadha
Delhi Liquor Case
Rajya Sabha

More Telugu News