కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులకు హైకోర్టులో భారీ ఊరట

  • 2011 మిలియన్ మార్చ్ కేసులను కొట్టివేసిన హైకోర్టు
  • ట్యాంక్‌బండ్‌పై నాడు నిర్వహించిన మిలియన్ మార్చ్‌లో ఉద్రిక్తత
  • కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై కేసు నమోదు
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావులకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2011లో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన మిలియన్ మార్చ్‌కు సంబంధించి నమోదైన కేసులను హైకోర్టు కొట్టివేసింది.

నాడు ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన మిలియన్ మార్చ్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులను నిందితులుగా చేర్చారు. ఈ కేసులో వీరికి ఎలాంటి సంబంధం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం వారిపై నమోదైన కేసులను కొట్టివేసింది.

KCR
KCR
KTR
Harish Rao
Telangana
BRS
Million March
Tank Bund
Hyderabad
High Court

More Telugu News